జిల్లా పోలీసు కార్యాలయం,   సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన తేది: 17-09-2025,

On
జిల్లా పోలీసు కార్యాలయం,   సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన తేది: 17-09-2025,

జిల్లా పోలీసు కార్యాలయం,
  సంగారెడ్డి జిల్లా.
పత్రిక ప్రకటన తేది: 17-09-2025,

     "తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం” సందర్భంగా ఈ రోజు తేది: 17.09.2025 నాడు సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉదయం 8:45 గంటలకు జిల్లా ఎస్.పి. శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్., గారు జాతీయ జెండాను ఆవిష్కరించి, సిబ్బందితో కలిసి జాతీయ గీతాలపన చేశారు. 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ... పోలీసు అధికారులకు, సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికి తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, హైదరాబాద్ సంస్థానం నిజాం నిరంకుశ పాలనలో ఉండేది.  ఆనాటి కేంద్ర హోమ్ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో చేపట్టిన ఆపరేషన్ పోలో విజయవంతమై, అప్పటి నిజాంరాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1948 సెప్టెంబర్ 17 సాయంత్రం 5 గంటలకు రేడియోలో ఉపన్యాసిస్తూ హైదరాబాద్ సంస్థానం..! భారత యూనియన్ లో అంతర్భాగం అని ప్రకటించడం జరిగింది. కావున ఈ రోజును మనం "తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం” గా జరుపుకుంటున్నాం అన్నారు. 

ప్రజాపాలన ప్రభుత్వం అనగా ప్రజలచేత, ప్రజలకొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం అని, ప్రజల సంక్షేమం కొరకు అనేక పథకాలు అమలు చేస్తూ.., ప్రతి పల్లె, ప్రతి వాడ, ప్రతి ఇంటి వరకు ప్రభుత్వ సేవలను చేరవేయడం ప్రజాపాలన ప్రధాన ధ్యేయం అని, ఇది “ప్రజల పాలన” అనే లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది అన్నారు.  

ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన మొదటి రోజు ఏ విధంగానైతే సమాజ సేవ చేయాలని ఉత్సాహంగా విధులలో చేరామో, అదే ఉత్సాహం చివరి వరకు కొనసాగిస్తూ.., తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టడానికి, మన వంతు కృషి చేయాలని అన్నారు. చివరగా, ఈ ప్రజాపాలన దినోత్సవం ప్రజల కోసం సేవాభావం, సమానత్వం, న్యాయం అనే విలువలను గుర్తు చేస్తుంది అన్నారు.

ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డి.యస్.పి. సత్తయ్య గౌడ్, ఎఆర్ డిఎస్పీ నరేందర్, అడ్మినిస్ట్రేషన్ అధికారి ఇ.కళ్యాణి, యస్.బి. ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, డి.సి.ఆర్.బి. ఇన్స్పెక్టర్ బి.రమేష్, ఐ.టి. ఇన్స్పెక్టర్స్ నాగేశ్వర్ రావ్, ప్రవీణ్ రెడ్డి, సదా నాగరాజు, ఆర్.ఐ.లు రామరావ్, రాజశేఖర్ రెడ్డి, డానియోల్, యస్.బి., డి.సి.ఆర్.బి. యస్.ఐ.లు సూపరింటెండెంట్ లు అశోక్, మరియు సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Image 2025-09-17 at 12.09.12_e23d6a56

Views: 0
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

క్లింకార న్యూస్: సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తుల క్లింకార న్యూస్: సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తుల
క్లింకార న్యూస్:సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తులఉమ్మడి మెదక్ జిల్లాలో 251 మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరి కిషన్ నోటిఫికేషన్ విడుదల...
వట్ పల్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కుల పంపి
ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను అరెస్టు చేస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను  అమలు చేయకపోతే....  పోరాటాలను ఉదృతం చేస్తాం? 
జిల్లా పోలీసు కార్యాలయం,           సంగారెడ్డి జిల్లా.  పత్రిక ప్రకటన, తేది: 26.09.2025
దమ్మపేటలో పారిశుద్ధ్యం లోపించినది క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 25 గ్రామములోనీ బజారులు చెత్తాచెదారంలో దర్శనమీస్తున్నవి
గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన నెట్‌వర్క్ అవసరం – టీఎసీ సభ్యుడు పల్లెల రామలక్ష్మయ్య డిమాండ్
క్లింకార న్యూస్: ఏ పార్టీతోనూ కలిసే ప్రసక్తే లేదు: కిషన్ రెడ్డి