మత్తుపదార్థాలపై అవగాహన – ‘చదివే ముద్దు, మత్తు వద్దు’ సందేశంతో బోధన్‌లో ఏఐపీఎస్యు ఆధ్వర్యంలో ప్రత్యేక సెమినార్.         క్లింగ్ కార న్యూస్ సెప్టెంబర్ 15 బోధన్ మండలం 

On
మత్తుపదార్థాలపై అవగాహన – ‘చదివే ముద్దు, మత్తు వద్దు’ సందేశంతో బోధన్‌లో ఏఐపీఎస్యు ఆధ్వర్యంలో ప్రత్యేక సెమినార్.         క్లింగ్ కార న్యూస్ సెప్టెంబర్ 15 బోధన్ మండలం 

మత్తుపదార్థాలపై అవగాహన – ‘చదివే ముద్దు, మత్తు వద్దు’ సందేశంతో బోధన్‌లో ఏఐపీఎస్యు ఆధ్వర్యంలో ప్రత్యేక సెమినార్.         క్లింగ్ కార న్యూస్ సెప్టెంబర్ 15 బోధన్ మండలం 
అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (ఎ ఐ పి ఎస్ యు) ఆధ్వర్యంలో బోధన్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో “సే నో టు డ్రగ్స్  – చదివే ముద్దు, మత్తు వద్దు” అనే నినాదంతో ప్రత్యేక అవగాహన సెమినార్ నిర్వహించారు. యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం విద్యలో ముందంజ వేయాలని పిలుపునిచ్చారు.
సభకు అధ్యక్షత వహించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానోపాధ్యాయులు సురేష్ కుమార్ మాట్లాడుతూ, “మత్తు పదార్థాలు తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయి కానీ శాశ్వతంగా జీవితాన్ని నాశనం చేస్తాయి. విద్యార్థులు ఈ దారిలోకి పోకుండా క్రమశిక్షణతో ముందుకు సాగాలి” అని సూచించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బోధన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ , ఎక్సైజ్ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ , అమృత హాస్పిటల్స్ బోధన్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ యం వి ఎస్ సుధాకర్ పాల్గొని యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ పై విద్యార్థులకు విలువైన సూచనలు అందించారు.
బోధన్ పట్టణ మరియు ఎక్సైజ్ శాఖ సిఐలు వెంకట్ నారాయణ ,భాస్కర్ రావు  మాట్లాడుతూ... విద్యార్థులు సమాజంలో మార్పుకు దారి చూపే వర్గమని, వారు మత్తుపదార్థాల వ్యసనానికి దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంబించాలి అన్నారు. ఆర్ ఎస్ పి రాష్ట్ర సహాయ కార్యదర్శి యార్లగడ్డ సాయిబాబా,ఏఐపీఎస్యు జిల్లా అధ్యక్షులు సాయికుమార్, జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ సింగ్ ఠాగూర్ తదితర నాయకులు విద్యార్థులలో డ్రగ్స్ వ్యతిరేక పోరాటంను విస్తృతంగా చేపట్టేలా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. డ్రగ్స్ వ్యతిరేకంగా ఒక గొంతుకగా నిలవాలని అందరికీ ఆవశ్యకత ఉందని పిలుపునిచ్చారు.

WhatsApp Image 2025-09-15 at 16.56.15_a4b01186

Views: 1
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

క్లింకార న్యూస్: సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తుల క్లింకార న్యూస్: సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తుల
క్లింకార న్యూస్:సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తులఉమ్మడి మెదక్ జిల్లాలో 251 మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరి కిషన్ నోటిఫికేషన్ విడుదల...
వట్ పల్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కుల పంపి
ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను అరెస్టు చేస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను  అమలు చేయకపోతే....  పోరాటాలను ఉదృతం చేస్తాం? 
జిల్లా పోలీసు కార్యాలయం,           సంగారెడ్డి జిల్లా.  పత్రిక ప్రకటన, తేది: 26.09.2025
దమ్మపేటలో పారిశుద్ధ్యం లోపించినది క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 25 గ్రామములోనీ బజారులు చెత్తాచెదారంలో దర్శనమీస్తున్నవి
గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన నెట్‌వర్క్ అవసరం – టీఎసీ సభ్యుడు పల్లెల రామలక్ష్మయ్య డిమాండ్
క్లింకార న్యూస్: ఏ పార్టీతోనూ కలిసే ప్రసక్తే లేదు: కిషన్ రెడ్డి