జిల్లా పోలీస్ కార్యాలయం,           సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన తేది: 22.09. 2025,  •    జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం.., ఫిర్యాదిదారుల నుండి ఫిర్యాదుల స్వీకరించిన.. జిల్లా ఎస్పీ

On
జిల్లా పోలీస్ కార్యాలయం,           సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన తేది: 22.09. 2025,  •    జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం.., ఫిర్యాదిదారుల నుండి ఫిర్యాదుల స్వీకరించిన.. జిల్లా ఎస్పీ

జిల్లా పోలీస్ కార్యాలయం,
          సంగారెడ్డి జిల్లా.
పత్రిక ప్రకటన తేది: 22.09. 2025, 
•    జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం.., ఫిర్యాదిదారుల నుండి ఫిర్యాదుల స్వీకరించిన.. జిల్లా ఎస్పీ
•    ఫిర్యాది సమస్యలను విని, వారి సమస్యల తక్షణ పరిష్కారానికై యస్.హెచ్.ఓ లకు ఫోన్ ద్వారా  సూచనలు.. 
•    సమస్యలకు సత్వర న్యాయం జరగనప్పుడు.. మూడవ వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా జిల్లా పోలీసు కార్యాలయాన్ని  సంప్రదించవచ్చు.. : జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు.   
 ఈ రోజు తేది: 22.09.2025 సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగం వివిధ మండలాల నుండి వచ్చిన ఫిర్యాదిదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు, పిర్యాది సమస్యలను ఓపికగా విని, సమస్య స్థితి, జాప్యానికి గల కారణాల గురించి సంబంధిత ఎస్.హెచ్.ఓ లకు ఫోన్ ద్వారా మాట్లాడి.. వివరాలను తెలుసుకున్నారు. చట్టాన్ని అమలు పరచడంలో ఎలాంటి అలసత్వం చూపరాదని, సివిల్ తగాదాలకు దూరంగా ఉండాలని, చట్టప్రకారం కేసులను పరిష్కరించాల్సిందిగా యస్.హెచ్.ఓ. లకు సూచనలు చేయడం జరిగింది. 
           జిల్లా ప్రజలు తమ సమస్యకు స్థానికంగా పరిష్కారం దొరకని సందర్భంలో నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీలకు తావు లేకుండా స్వచ్చంధంగా జిల్లా పోలీసు కార్యాలయ సేవలను వినియోగించుకోవాలని అన్నారు. సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించేందుకు, సత్వర న్యాయం చేసేందుకు, పోలీసుశాఖ ప్రజలకు మరింత దగ్గరయ్యేలా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీసు శాఖ ముందు ఉంటుందని, జిల్లా ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలసిందిగా జిల్లా ఎస్పీ గారు సూచించడం జరిగింది.

WhatsApp Image 2025-09-22 at 3.52.12 PM

Views: 2
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

క్లింకారా న్యూస్: సదాశివపేట మున్సిపాలిటీలో 14 నామినేషన్లు క్లింకారా న్యూస్: సదాశివపేట మున్సిపాలిటీలో 14 నామినేషన్లు
క్లింకారా న్యూస్: సదాశివపేట మున్సిపాలిటీలో 14 నామినేషన్లు సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికల తొలిరోజైన బుధవారం మొత్తం 14 నామినేషన్లు దాఖలయ్యాయి. కమిషనర్ శివాజీ తెలిపిన వివరాల ప్రకారం,...
క్లింకారా న్యూస్:  తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు నేడు షెడ్యూల్ విడుదల
క్లింకారా న్యూస్: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు రంగం సిద్ధం!
క్లింకారా న్యూస్: వసంత పంచమి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ: భక్తులకు పిలుపు
క్లింకారా న్యూస్: మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. అడిషనల్ కలెక్టర్ మాధురి
క్లింకారా న్యూస్: రెండూ ఒక్కటే! "యూట్యూబ్ అయినా.. టీవీ అయినా.. లక్ష్యం ఒక్కటే!"
క్లింకారా న్యూస్: మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. అడిషనల్ కలెక్టర్ మాధురి