జాతీయ
జాతీయ  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను అరెస్టు చేస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను  అమలు చేయకపోతే....  పోరాటాలను ఉదృతం చేస్తాం? 

ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను అరెస్టు చేస్తారా  కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను  అమలు చేయకపోతే....  పోరాటాలను ఉదృతం చేస్తాం?  ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను అరెస్టు చేస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకపోతే.... పోరాటాలను ఉదృతం చేస్తాం?   అక్రమ అరెస్టులపై ఉన్న దృష్టి రాష్ట్ర ప్రభుత్వానికి సమస్యలపై దృష్టి ఎందుకు లేదు? ప్రజా పాలన అంటే అక్రమ అరెస్టుల? సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి సాయిలు డిమాండ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకపోతే పోరాటాలను ఉదృతం చేస్తాం అంగన్వాడీ టీచర్లను అక్రమ అరెస్టును ఖండించండి అక్రమ అరెస్టులపై ఉన్న దృష్టి రాష్ట్ర ప్రభుత్వానికి సమస్యలపై దృష్టి ఎందుకు లేదు-?ప్రజా పాలన అంటే అక్రమ అరెస్టులా అని  సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి సాయిలు అన్నారు ఈరోజు సీఐటీయూ నాయకులను అక్రమంగా ఉదయం 4 గంటల నుండి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో దిగ్బంధించడం చాలా దారుణం అని అన్నారు అక్రమంగా అరెస్టు అయిన అంగన్వాడి  టీచర్లను వెంటనే విడుదల చెయ్యాలి ఈ సందర్భంగా సీఐటీయూ  జిల్లా కార్యదర్శి జి, సాయిలు  మాట్లాడుతూ  జిల్లాలో అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని  ప్రశాంతంగా వెళుతున్న అంగన్వాడీ టీచర్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం చాలా దారుణం అని అన్నారు ఇండ్లలో వెళ్లి సెంటర్లకు వెళ్లి అరెస్టు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారుమహిళలని చూడకుండా ఇబ్బందులకు గురిచేస్తూ, బలవంతంగా ఒత్తిడి చేసి అరెస్టు చేయడం ఏ రకమైన ప్రజా పాలన అవుతుం ది...?? ప్రభుత్వం. పోలీస్ యంత్రాంగం ఆలోచించాలి. అర్ధరాత్రి నుండి మహిళలు అని చూడకుండా అరెస్టులు చేసి మండలాలలో పోలీస్స్టేషన్లో నిర్బంధించారు.   ఎన్నికల సందర్భంగా  రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల కార్మికుల సమస్యలను పరిష్కారం చేస్తాం  కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే  కనీస వేతనాలు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు ఎన్నికల హామీని ఇప్పటివరకు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి టీచర్లు, కార్యకర్తలు  కొద్దిరోజులుగా ప్రీ ప్రైమరీ పాఠశాలలను అంగన్వాడిలకు అప్పగించాలని పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రావడం లేదన్నారు,       మహిళా ఉద్యోగులు తామ గోడు వెల్లబోసుకున్న పెడచెవిన పెడుతుందన్నారు, ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ ఇంగ్లీష్ మీడియం విద్య పేరుతో ఐదు సంవత్సరాల లోపు పిల్లలను విద్యాశాఖకు అప్పగించడం అన్యాయమన్నారు, ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు, ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ  ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీవిద్యను అంగన్వాడి కేంద్రాల్లోనే నిర్వహించాలన్నారు, విద్యా బోధనా బాధ్యతను అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కు ఇవ్వాలన్నారు, ఇంగ్లీష్ మీడియం విద్యకు వ్యతిరేకం కాదని ఐసిడిఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయన్నారు, ఆరు సంవత్సరాల లోపు పిల్లల మానసిక ,శారీరక ఎదుగుదల లో కీలకపాత్ర పోషిస్తున్న ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా ఉందన్నారు, ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు కావలసింది విద్య ఒకటే కాదని విద్య కంటే పౌష్టికాహారం అత్యంత ముఖ్యమైందన్నారు, 50 సంవత్సరాల క్రితం ఐసిడిఎస్ ఏర్పడిందన్నారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంతో  శారీరక, మానసిక ఎదుగుదల అభివృద్ధి జరగకపోతే జీవితాంతం అంగవైకల్యంతో పిల్లలు బాధపడవలసి వస్తుందన్నారు, ప్రభుత్వాలు తీసుకుంటూన నిర్ణయంతో భావితరాల అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నయన్నారు, ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్లకు బోధించే బాధ్యత ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశాడు లేని పక్షంలో ప్రభుత్వం పైన పోరాటం నిర్వహిస్తామని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు
Read More...
జాతీయ  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

క్లింకార న్యూస్: ఏ పార్టీతోనూ కలిసే ప్రసక్తే లేదు: కిషన్ రెడ్డి

క్లింకార న్యూస్: ఏ పార్టీతోనూ కలిసే ప్రసక్తే లేదు: కిషన్ రెడ్డి క్లింకార న్యూస్:ఏ పార్టీతోనూ కలిసే ప్రసక్తే లేదు: కిషన్ రెడ్డిTG: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఒంటరిగానే ముందుకెళ్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. తాము ఏ పార్టీతోనూ కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. BC రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలోనిది కాదని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు అమలు చేయాలని తెలిపారు. భారత్ లో జెన్ జీ ఉద్యమం వస్తుందని KTR చేసిన దేశద్రోహ వ్యాఖ్యలను ప్రజలు ఖండించాలన్నారు.
Read More...
జాతీయ  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్  సాంకేతికత  లైఫ్ స్టైల్ 

క్లింకార న్యూస్: సింగూర్ కు భారీ వరద.. 7 గేట్లు ఓపెన్

క్లింకార న్యూస్: సింగూర్ కు భారీ వరద.. 7 గేట్లు ఓపెన్ క్లింకార న్యూస్:సింగూర్ కు భారీ వరద.. 7 గేట్లు ఓపెన్పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టులో మంగళవారం 58,696 క్యూసెక్కుల వరద చేరినట్లు ప్రాజెక్టు ఏఈ స్టాలిన్ తెలిపారు. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరుగుతోందని ఆయన చెప్పారు. ప్రాజెక్టు నుంచి 7 గేట్ల ద్వారా 58,892 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం 16.607 టీఎంసీలకు చేరింది, ఇది మొత్తం సామర్థ్యం 29.917 టీఎంసీలలో భాగం.
Read More...
జాతీయ  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

లెర్న్ ఫర్ లైఫ్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

లెర్న్ ఫర్ లైఫ్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు లెర్న్ ఫర్ లైఫ్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 20అశ్వారావుపేట, సెప్టెంబర్ 18 :అశ్వారావుపేట మండలం, లెర్న్ ఫర్ లైఫ్ స్కూల్ లో ఎచ్ఎం కళ్యాణి ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిపారు.శనివారం పాఠశాల ఆవరణలో వివిధ రకాల పూలతో బతుకమ్మ ఆడారు. ఉత్సహంగా.. ఉల్లాసంగా బతుకమ్మ పాటలు పాడారు. అనతరం స్థానికంగా ఉన్న దొంతికుంట చెరువులో వాటిని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎచ్ఎం కల్యాణి మాట్లాడుతూ..ఇది తెలంగాణ మహిళల సాంస్కృతిక జీవితంలో భాగం కావాలన్నారు. ప్రకృతిలోని వివిధ రకాల పూలను ఉపయోగించి బతుకమ్మను అలంకరించడం వల్ల ప్రకృతి ఆరాధన, పర్యావరణంపై ప్రేమ తెలుస్తాయన్నారు. ఈ పండుగ కుటుంబ బంధాలను, ముఖ్యంగా మహిళల మధ్య స్నేహబంధాలను బలపరుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు  పాల్గొన్నారు.
Read More...
జాతీయ  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

జిల్లా పోలీసు కార్యాలయం,  సంగారెడ్డి జిల్లా.  పత్రిక ప్రకటన తేది: 18-09-2025

జిల్లా పోలీసు కార్యాలయం,  సంగారెడ్డి జిల్లా.   పత్రిక ప్రకటన తేది: 18-09-2025 జిల్లా పోలీసు కార్యాలయం,               సంగారెడ్డి జిల్లా.  పత్రిక ప్రకటన తేది: 18-09-2025 •    వార్షిక తనిఖీలలో భాగంగా పుల్కల్ పోలీసు స్టేషన్ ను ఇన్స్పెక్షన్ చేసిన జిల్లా ఎస్పీ.•    పోలీసు స్టేషన్ ఆవరణ పరిశుభ్రత, రికార్డ్స్ మెంటేనేన్స్, సిబ్బంది కిట్ ఆర్టికల్స్ పరిశీలన.. •    స్టేషన్ అధికారి, సిబ్బంది పని తీరు బాగుంది.. : జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు. వార్షిక తనిఖీలలో భాగంగా ఈ రోజు తేది: 18-09-2025 నాడు పుల్కల్ పోలీసు స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్  గారు, ఈ సందర్భంగా పుల్కల్ పోలీసు గౌరవ వందనం స్వీకరించి, డిఎస్పీ గారితో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు.. అనంతరం స్టేషన్ పరిసరాల శుభ్రత, సిబ్బంది బ్యారక్స్, స్టేషన్ రికార్డుల మెంటేనేన్స్ ను పరిశీలించారు. సిబ్బంది కిట్ ఆర్టికల్స్ తనిఖీ చేస్తూ.. కిట్ ఆర్టికల్స్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న స్వాధీనం చేసుకున్న/ కేసులో ఉన్న వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ రికార్డు లను తనఖీ చేస్తూ ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును చేయాలని, ఆస్థి సంబంధిత నేరాలకు సంబంధించి, అధిక నేరాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పార్ట్స్ లు గా గుర్తించి, పగలు, రాత్రి బీట్ డ్యూటీల ద్వారా నిఘా కట్టుదిట్టం చేయాలని సూచించారు. రిసీప్షన్ సిబ్బంది స్టేషన్ కు వచ్చిన ప్రతి దరఖాస్తును ఆన్లైన్ లో నమోదు చేయాలని, ఫిర్యాదిదారులతో మర్యాదగా మాట్లాడాలని అన్నారు. విలేజ్ పోలీసు అధికారులు తమకు కేటాయించిన విలేజ్ పై పూర్తి అవగాహన ఉండాలని, గ్రామ పెద్దలతో యువతతో సత్:సంబంధాలను కలిగి ఉండాలని అన్నారు. స్టేషన్ పరిదిలో గల రౌడీ, సస్పెక్ట్ హిస్టరీ షీటర్లను చెక్ చేస్తూ ఆన్లైన్ రికార్డు లో నమోదు చేయాలన్నారు.  అనుమానిత వ్యక్తులను పాపిలోన్ డివైస్ ను వినియోగించి, వేలిముద్రాలను చెక్ చేస్తూ.. పాత నేరస్తులను గుర్తించాలని అన్నారు. నేరాల అదుపులో, జరిగిన నేరాలను ఛేదించడంలో ఉపయోగపడే సిసి కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ.. ప్రజలే స్వచ్ఛందంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు. స్టేషన్ రికార్డులైన పార్ట్ 1 - 5 పెండింగ్ లేకుండా చూడాలని, సిబ్బందికి వర్టికల్ వారీగా విధులను కేటాయించాలని ఎస్.హెచ్.ఓ కు సూచించడం జరిగింది. రోడ్డు ప్రమాదాల నివారణకు, సైబర్ నేరాల నివారణకు వివిధ స్కూల్స్ కళాశాలలు, పని ప్రదేశాలలో కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా అవగాహన కల్పించాలని అన్నారు. విజిబుల్ పోలీసింగ్‌ లో భాగంగా ప్రతి రోజు వాహానాల తనిఖీ నిర్వహిస్తూ, ట్రాఫిక్ నియమాలు పాటించని వాహణదారులపై చర్యలు తీసుకోవాలని, అనుమానిత వాహనాలను అదుపులోకి తీసుకోవాలని అన్నారు.  బ్లూ కోల్ట్స్ సిబ్బంది ప్రతి పాయింట్ ను తనిఖీ చేయాలని, డైల్ -100 కాల్స్ కు త్వరితగతిన స్పందించాలని సూచించారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర పోలీసుశాఖ అందుబాటులోకి తీసుకువచ్చిన సీసీటీఎన్ఎస్ - 2.0, పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్,  టీఎస్-కాప్, హెచ్‌ఆర్‌ఎంఎస్, ఈ-సాక్ష్య, టెక్ డాటం, ఐరాడ్ దర్పణ్, సీఈఐఆర్, సైబర్ క్రైమ్‌ నేరాల నియంత్రణ, సీడీఆర్, సిఇఐఆర్ పోర్టల్, పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్, బాడీ ఓన్ కెమెరాల వంటి సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లు నేరాల అదుపునకు, జరిగిన నేరాలను ఛేదించడానికి ఉపయోగకరంగా ఉన్నాయని, అన్ని అప్లికేషన్లపై పూర్తి స్థాయిలో పట్టు సాధించి, నేరాల నియంత్రణలో కీలకంగా వ్యవహించాలని సిబ్బందికి సూచించడం జరిగింది, ఇప్పుడు నేర్చుకున్న పని మీ సర్వీస్ మొత్తం ఉపయోగపడుతుందన్నారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ..  విధి నిర్వాహణలో అంకిత భావంతో పని చేయాలని. ఎవరికీ కేటాయించిన విధులను వారు సక్రమంగా నిర్వర్తించినప్పుడే పోలీసు శాఖకు మంచి పేరు వస్తుందని  అన్నారు.  డ్యూటీ పరంగా లేదా వ్యకిగతంగా ఎలాంటి సమస్య ఉన్న నేరుగా నా దృష్టికి తీసుకురావొచ్చు అన్నారు. పోలీస్ స్టేషన్, రికార్డుల మెయింటనెన్స్ బాగుందని, అధికారులు, సిబ్బందిని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పుల్కల్ మండల పరిదిలో NH-161 రోడ్డు పై అధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న (బ్లాక్ స్పార్ట్) ను ఎస్పీ గారు ప్రత్యేకంగా సందర్శించి,  వాహనాల వేగం అదుపునకు ర్యాంబుల్ స్ట్రిప్స్, ఇసుక డ్రమ్ములు ఏర్పాటు చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు..  ఈ తనిఖీ లలో ఎస్పీ గారి వెంబడి సంగారెడ్డి డియస్పి సత్యయ్య గౌడ్, జోగిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అనిల్, ఎస్ఐ విశ్వజన్ లు ఉన్నారు.
Read More...
జాతీయ  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్  లైఫ్ స్టైల్ 

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయం లో జాతీయ జెండా ను ఆవిష్కరించిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయం లో జాతీయ జెండా ను ఆవిష్కరించిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయం లో జాతీయ జెండా ను ఆవిష్కరించిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి గారు  సేవ పక్వాడ్ కార్యక్రమం లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్బంగా బీజేపీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం లో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు మాణిక్ రావు, రాజశేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు వెంకట నర్సింహా రెడ్, పవన్ డి,సీనియర్ నాయకులు రాములు, బీజేవైఎం అధ్యక్షులు ప్రవీణ్, రాష్ట్ర నాయకులు నరేన్ జిల్లా కార్యదర్శులు భూమయ్య, శంషాబాద్ రాజు మండల అధ్యక్షులు     వాసు, విజయ్, ఆదిత్య వివిధ మండలాల అధ్యక్షులు సీనియర్ నాయకులు ఇతర నాయకులు పాల్గొనడం జరిగింది
Read More...
జాతీయ  ప్రపంచం  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్  సాంకేతికత 

పత్రికా ప్రకటన  💥🇻🇳 అమృత్ లాల్ శుక్ల కార్మిక భవనంలో  కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభ 💥🇻🇳 దేశ రాజకీయ రంగంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి లేని వెలతి స్పష్టంగా కనిపిస్తున్నది

పత్రికా ప్రకటన   💥🇻🇳 అమృత్ లాల్ శుక్ల కార్మిక భవనంలో  కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభ 💥🇻🇳 దేశ రాజకీయ రంగంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి లేని వెలతి స్పష్టంగా కనిపిస్తున్నది పత్రికా ప్రకటన  💥🇻🇳 అమృత్ లాల్ శుక్ల కార్మిక భవనంలో  కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభ💥🇻🇳 దేశ రాజకీయ రంగంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి లేని వెలతి స్పష్టంగా కనిపిస్తున్నది*💥🇻🇳 కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పిస్తున్న CPM పార్టీ  జిల్లా కార్యదర్శి ము శం రమేష్ సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి కోడం రమణ సిపిఎం జిల్లా నాయకులు రమేష్ చంద్ర నక్క దేవదాస్ సందు పట్ల పోచమల్లు*💥🇻🇳 ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ము శం రమేష్ మాట్లాడుతూ భారతదేశ రాజకీయ రంగంలో కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు యోధుల్లో ఒకరు కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు అని మార్క్స్ సిద్ధాంతాన్ని భారత దేశ పరిస్థితుల కనుగుణంగా అన్వయింపజేసి దోపిడి పీడన కుల వివక్ష అంటరానితనం ఉన్నంతవరకు ఎర్రజెండా ఎప్పుడు పేదలకు ఆచరించుకొని వర్గ పోరాటాల ద్వారానే భారత దేశ సమస్యలు పరిష్కారమైతావని దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలకు దిక్సూచిగా నిలబడిన మేధావి కామ్రేడ్ సీతారాం ఏచూరి అని అన్నారు భారత రాజ్యాంగ మౌలిక విలువలు అయిన ప్రజాస్వామ్యం లౌకికవాదం ఫెడరలిజం సామాజిక న్యాయం సమానత్వం భారత రాజ్యాంగ రక్షణకై అనేక ఉద్యమాలు నడిపిన వ్యక్తి అని అన్నారు మతోన్మాద శక్తులు దేశంలో  కులమత ప్రాత్పాదికన ప్రజలను విడగొట్టి అనేక విధ్వంసాలు సృష్టించాలనుకున్న ప్రతిసారి పార్టీ శ్రేణులను ఐక్యపరిచి మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలకు రూపకల్పన చేశారన్నారు ప్రపంచంలో ఉన్న సోషలిస్టు దేశాలలో కలియతిరిగి ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కొంటున్న దేశాలకు వామపక్ష ఆలోచనలను నూరిపోసిన గొప్ప మేధావి అని అన్నారు విద్యార్థి దశ నుంచే వామపక్ష ఆలోచనలను  వంట పట్టించుకోని CPM పార్టీలో అంచలంచలుగా ఎదుగుతూ అఖిల భారత స్థాయిలో జాతీయ కార్యదర్శిగా పనిచేస్తూ అకాల మరణం చెందడం CPM పార్టీకి తీరని లోటు అని అన్నారు పార్లమెంటు రంగంలో రాజ్యసభ సభ్యులుగా ఉండి దేశ పరిస్థితులపై సంపూర్ణ అవగాహన పెంచుకొని ప్రజల సమస్యలపై ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పార్లమెంటులో అనేక సందర్భాలలో గళం విప్పారని ఆయన వాగ్చాతుర్యం ఇతర ప్రతిపక్షాలు కూడా మెచ్చుకొని పోరాటాలలో భాగస్వామ్యం అయ్యేవారని సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేసే సందర్భాలలో సీతారాం ఏచూరి గారు ప్రతిపక్షాలను సహనంతో సమన్వయంతో ఐక్యపరిచేవారని సంకీర్ణ ప్రభుత్వాలు నడిపించే వారని అన్నారు రాబోయే కాలంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు ఆశించి నడిచిన మార్గంలో ప్రజల సమస్యల పరిష్కారం కై వర్గ పోరాటాలు నిర్వహిస్తూనే సమ సమాజ స్థాపన కై నిరంతరం ఉద్యమాలు కొనసాగిస్తామని అన్నారు
Read More...
జాతీయ  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

ఆర్ ఆర్ ఆర్ లో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయండి... ఎమ్మెల్యేచింతా ప్రభాకర్  త్రిబుల్ ఆర్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ను కోరారు.... 

ఆర్ ఆర్ ఆర్ లో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయండి... ఎమ్మెల్యేచింతా ప్రభాకర్   త్రిబుల్ ఆర్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ను కోరారు....  ఆర్ ఆర్ ఆర్ లో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయండి... ఎమ్మెల్యేచింతా ప్రభాకర్  త్రిబుల్ ఆర్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ను కోరారు....  శుక్రవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలోని కలెక్టర్ ప్రావిణ్యకు కొండాపూర్ రైతులతో కలిసి వినతి పత్రం అందజేశారు... కొండాపూర్ మండలంలోని గిర్మాపూర్, అలియాబాద్, మారేపల్లి, మాచేపల్లి, గంగారం శివన్న గూడెం, రాంపూర్ తండా గ్రామ పరిధిలో నీరు పెద రైతులు కోపోతున్న భూములపై జీవనం కొనసాగిస్తున్నారు...పట్టా భూములు ఆర్.ఆర్.ఆర్ రోడ్డు మరమ్మతులో కోల్పోకుండా నీరు పెద రైతులను కాపాడాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు తెలిపారు ...  ఆర్ఆర్ఆర్ లో పట్టా భూములు కోల్పోవడం తో మండలంలోని నీరు పెద రైతులు రోడ్డున పడతారని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కలెక్టర్ కు వివరించారు..  రైతుల మంచి కోరే ప్రభుత్వం, రైతులను రోడ్డునా పడేసి ఆర్ ఆర్ ఆర్ ఏర్పాటు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు... రైతులను సంతృప్తి చేసే విదంగా ఆర్ ఆర్ ఆర్ విధానాలు ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ..  ఆర్ఆర్ఆర్ లో భూములు కోల్పోతే జీవింతచడం భారంగా ఉందని భూములు కోల్పోతున్న రైతుల గురించి ఆలోచించాలని కోరారు....   కొండాపూర్ మండల పరిధిలో RRR లో కోల్పోతున్న భూములను అలైన్మెంట్ చేంజ్ చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరారు... కార్యక్రమంలో మాజీ CDC చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాణిక్ ప్రభూ ,రుక్మోదిన్, గోవర్ధన్ రెడ్డి, వినోద్, రాజు, ఆంజనేయులు, ప్రేమ నందం, సత్య నందం ప్రకాష్, అంజి రెడ్డి, జయేందర్ , నర్సింలు, మహేష్, పరమేశ్వర తదితరులు ఉన్నారు ...
Read More...
జాతీయ  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

ఈరోజు సిర్గాపూర్ మండలంలో రైతు వేదిక దగ్గర భారత దేశం లో నిత్యావసర వస్తువులపై GST తగ్గించినందుకు భరత పార్ధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చిత్ర పటానికి పాలా అభిషేకం చేయటం చేసిన BJP సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అరుణ్‌రాజ్ శేరికార్ 

ఈరోజు సిర్గాపూర్ మండలంలో రైతు వేదిక దగ్గర భారత దేశం లో నిత్యావసర వస్తువులపై GST తగ్గించినందుకు భరత పార్ధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చిత్ర పటానికి పాలా అభిషేకం చేయటం చేసిన BJP సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అరుణ్‌రాజ్ శేరికార్  ఈరోజు సిర్గాపూర్ మండలంలో రైతు వేదిక దగ్గర భారత దేశం లో నిత్యావసర వస్తువులపై GST తగ్గించినందుకు భరత పార్ధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చిత్ర పటానికి పాలా అభిషేకం చేయటం చేసిన BJP సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అరుణ్‌రాజ్ శేరికార్  వారితో పాటు మండల అధ్యక్షులు శంకర్ రావు పటేల్ , ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పటేల్ , యువాధ్యక్షుడు యాదగిరి ముదిరాజ్ & గ్రామస్థులు పాల్గొన్నారు
Read More...
జాతీయ  ప్రత్యేకం  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

పత్రికా ప్రకటన  ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కేసీఆర్ నగర్లో వికలాంగులకు 6000 వృద్ధులకు వితంతులకు ఒంటరి మహిళలకు బోదకాల వ్యాధి హెచ్ఐవి క్యాన్సర్ వివిధ రకాల పెన్షన్లకు 4000

పత్రికా ప్రకటన  ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కేసీఆర్ నగర్లో వికలాంగులకు 6000 వృద్ధులకు వితంతులకు ఒంటరి మహిళలకు బోదకాల వ్యాధి హెచ్ఐవి క్యాన్సర్ వివిధ రకాల పెన్షన్లకు 4000 పత్రికా ప్రకటన ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కేసీఆర్ నగర్లో వికలాంగులకు 6000 వృద్ధులకు వితంతులకు ఒంటరి మహిళలకు బోదకాల వ్యాధి హెచ్ఐవి క్యాన్సర్ వివిధ రకాల పెన్షన్లకు 4000 మరియు రక్తహీనత బాధపడే వారికి 15000 రూపాయలు వెంటనే పెంచాలని మరియు 18 సంవత్సరాలు నిండిన వారికి ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రేపు అనగా సోమవారం రోజున ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించడానికి తంగళ్ళపల్లి మండల కేంద్రం నుండి పెన్షన్ దారులు భారీగా తరలిరావాలని మండలంలోని అన్ని గ్రామాలలో ఇంటింటా తిరిగి ప్రచారం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షులు సావనపల్లి బాలయ్య రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి పుట్ట రావన్న జిల్లా కన్వీనర్ ఎలగందల బిక్షపతి ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ మరియు వికలాంగుల జిల్లా కన్వీనర్ సడిమెల శోభ శామ్యూల్ మరియు ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
Read More...
జాతీయ  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి

దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి నివాళులర్పించిన బోయినిపల్లి కాంగ్రెస్ శ్రేణులు బోయినిపల్లి మండలం లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. రైతును రాజుగా చేసేందుకు అనేక సంక్షేమ పథకాలను వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Read More...
జాతీయ  ప్రపంచం 

జిల్లా ప్రెస్ క్లబ్ బ్రోచర్ ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్ 33 మంది జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ల జిల్లా ప్రెస్ క్లబ్  క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆగస్టు 31

జిల్లా ప్రెస్ క్లబ్ బ్రోచర్ ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్  33 మంది జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ల జిల్లా ప్రెస్ క్లబ్  క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆగస్టు 31 జిల్లా ప్రెస్ క్లబ్ బ్రోచర్ ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్ 33 మంది జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ల జిల్లా ప్రెస్ క్లబ్ క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆగస్టు 31కొత్తగూడెం ఆగస్ట్ 31( ):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు రత్నకుమార్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ను జిల్లా ప్రెస్ క్లబ్ 33 మంది స్టాఫ్ రిపోర్టర్ల బృందం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కు చెందిన 33 మంది జిల్లా స్టాఫ్ రిపోర్టర్ల తో కూడిన బ్రోచర్‌ను అదనపు కలెక్టర్ వేణుగోపాల్  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  అదనపు కలెక్టర్  మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్యగా వారధిగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేస్తున్నా 33 మంది మీడియా ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  ప్రెస్ క్లబ్ కార్యదర్శి ముత్యాల రాజేష్ శ్రీ సూర్య స్టాఫ్ రిపోర్టర్ వివిధ పత్రికల జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు బరిగెల భూపేష్ కుమార్, కత్తి బాలకృష్ణ, ఈ.వీర రాఘవులు, జె పల్గుణ, ఎన్. శ్రీనివాసు, కె.సురేష్, ఎస్డి నూర్ రబ్బాని, ఏ సుధీర్ కుమార్, జి సతీష్ కుమార్, ఎస్ ప్రవీణ్, ఆర్ నవీన్, ఆర్ పోలయ్య, ఎం మహేష్ కుమార్, బి సాయి కౌశిక్ , సి.లెనిన్ కుమార్, ఏ.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Read More...