తెలంగాణ
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... క్లింకారా న్యూస్: సదాశివపేట మున్సిపాలిటీలో 14 నామినేషన్లు
Published On
By KLINKARA NEWS
క్లింకారా న్యూస్: సదాశివపేట మున్సిపాలిటీలో 14 నామినేషన్లు సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికల తొలిరోజైన బుధవారం మొత్తం 14 నామినేషన్లు దాఖలయ్యాయి. కమిషనర్ శివాజీ తెలిపిన వివరాల ప్రకారం, కాంగ్రెస్ పార్టీ 5, బీఆర్ఎస్ 4, బీజేపీ 2, స్వతంత్ర అభ్యర్థులు 3 నామినేషన్లు సమర్పించారు. ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. క్లింకారా న్యూస్: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు రంగం సిద్ధం!
Published On
By KLINKARA NEWS
క్లింకారా న్యూస్: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు రంగం సిద్ధం! తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు రంగం సిద్ధమైంది. ఈ నెల 24 లేదా 27న రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. దీంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల వేట, వ్యూహాలు రచిస్తున్నాయి. క్లింకారా న్యూస్: వసంత పంచమి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ: భక్తులకు పిలుపు
Published On
By KLINKARA NEWS
క్లింకారా న్యూస్: వసంత పంచమి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ: భక్తులకు పిలుపు సంగారెడ్డి పట్టణంలోని శ్రీ విద్యా సరస్వతి మాత దేవాలయంలో శుక్రవారం, 23-1-2026న జరిగే వసంత పంచమి ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అర్చకులు, కమిటీ సభ్యులు మాట్లాడుతూ, అమ్మవారికి కుంభాభిషేకం, పంచామృతాభిషేకం, అలంకరణ, మంగళ హారతి, మంత్ర పుష్పాలు, కుంకుమార్చనలు, అక్షరాభ్యాసాలు, ప్రదోష పూజ వంటి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. క్లింకారా న్యూస్: మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. అడిషనల్ కలెక్టర్ మాధురి
Published On
By KLINKARA NEWS
క్లింకారా న్యూస్: మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. అడిషనల్ కలెక్టర్ మాధురి సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందోల్-జోగిపేట్, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇంద్రేశం, ఇస్నాపూర్, జిన్నారం, కోహిర్, నారాయణఖేడ్, సదాశివపేట్, సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీల వార్డు స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు అడిషనల్ కలెక్టర్ మాధురి శనివారం తెలిపారు. ఈ ప్రక్రియ ఎన్నికల సన్నద్ధతలో కీలకమైనది క్లింకారా న్యూస్: మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. అడిషనల్ కలెక్టర్ మాధురి
Published On
By KLINKARA NEWS
క్లింకారా న్యూస్:మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. అడిషనల్ కలెక్టర్ మాధురి సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందోల్-జోగిపేట్, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇంద్రేశం, ఇస్నాపూర్, జిన్నారం, కోహిర్, నారాయణఖేడ్, సదాశివపేట్, సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీల వార్డు స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు అడిషనల్ కలెక్టర్ మాధురి శనివారం తెలిపారు. ఈ ప్రక్రియ ఎన్నికల సన్నద్ధతలో కీలకమైనది క్లింకార న్యూస్: సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తుల
Published On
By KLINKARA NEWS
క్లింకార న్యూస్:సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తులఉమ్మడి మెదక్ జిల్లాలో 251 మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరి కిషన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సంగారెడ్డి జిల్లాలో 101, మెదక్ జిల్లాలో 47, సిద్దిపేట జిల్లాలో 93 దుకాణాలు కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 23న డ్రా తీస్తారు. ఒక్కో దుకాణానికి రూ. 3 లక్షల టెండర్ ఫీజు చెల్లించాలని, ఇది తిరిగి చెల్లించబడదని ఆయన వివరించారు. వట్ పల్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కుల పంపి
Published On
By KLINKARA NEWS
వట్ పల్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కుల పంపిణీ. తెలంగాణ రాష్ట్ర సీఎం రెవంత్ రెడ్డి గారి సహకారంతో మంత్రి దామోదర్ రాజనర్సింహ సార్ గారి ఆదేశానుసారం వట్ పల్లి మండలంలో కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కులు మొత్తం 56 మందికి 56,06,496 రూ,,ల చెక్కులు ఇవ్వడం జరిగింది. కల్యాణ లక్ష్మి 48 షాది ముబారక్ 08 చెక్కులు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో MRO చంద్రశేఖర్ సార్, TPCC ఉపాధ్యక్షులు సంగమేశ్వర్ సార్ గారు, వట్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రతాప్ రమేష్ జోషి సార్ గారు, ATMA కమిటీ చైర్మన్ కచూర్ రావు సార్ గారు, వివిధ గ్రామాల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ మెంబర్ లు, యువజన నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను అరెస్టు చేస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకపోతే.... పోరాటాలను ఉదృతం చేస్తాం?
Published On
By KLINKARA NEWS
ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను అరెస్టు చేస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకపోతే.... పోరాటాలను ఉదృతం చేస్తాం? అక్రమ అరెస్టులపై ఉన్న దృష్టి రాష్ట్ర ప్రభుత్వానికి సమస్యలపై దృష్టి ఎందుకు లేదు? ప్రజా పాలన అంటే అక్రమ అరెస్టుల? సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి సాయిలు డిమాండ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకపోతే పోరాటాలను ఉదృతం చేస్తాం అంగన్వాడీ టీచర్లను అక్రమ అరెస్టును ఖండించండి అక్రమ అరెస్టులపై ఉన్న దృష్టి రాష్ట్ర ప్రభుత్వానికి సమస్యలపై దృష్టి ఎందుకు లేదు-?ప్రజా పాలన అంటే అక్రమ అరెస్టులా అని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి సాయిలు అన్నారు ఈరోజు సీఐటీయూ నాయకులను అక్రమంగా ఉదయం 4 గంటల నుండి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో దిగ్బంధించడం చాలా దారుణం అని అన్నారు అక్రమంగా అరెస్టు అయిన అంగన్వాడి టీచర్లను వెంటనే విడుదల చెయ్యాలి ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి, సాయిలు మాట్లాడుతూ జిల్లాలో అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని ప్రశాంతంగా వెళుతున్న అంగన్వాడీ టీచర్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం చాలా దారుణం అని అన్నారు ఇండ్లలో వెళ్లి సెంటర్లకు వెళ్లి అరెస్టు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారుమహిళలని చూడకుండా ఇబ్బందులకు గురిచేస్తూ, బలవంతంగా ఒత్తిడి చేసి అరెస్టు చేయడం ఏ రకమైన ప్రజా పాలన అవుతుం ది...?? ప్రభుత్వం. పోలీస్ యంత్రాంగం ఆలోచించాలి. అర్ధరాత్రి నుండి మహిళలు అని చూడకుండా అరెస్టులు చేసి మండలాలలో పోలీస్స్టేషన్లో నిర్బంధించారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల కార్మికుల సమస్యలను పరిష్కారం చేస్తాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే కనీస వేతనాలు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు ఎన్నికల హామీని ఇప్పటివరకు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి టీచర్లు, కార్యకర్తలు కొద్దిరోజులుగా ప్రీ ప్రైమరీ పాఠశాలలను అంగన్వాడిలకు అప్పగించాలని పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రావడం లేదన్నారు, మహిళా ఉద్యోగులు తామ గోడు వెల్లబోసుకున్న పెడచెవిన పెడుతుందన్నారు, ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ ఇంగ్లీష్ మీడియం విద్య పేరుతో ఐదు సంవత్సరాల లోపు పిల్లలను విద్యాశాఖకు అప్పగించడం అన్యాయమన్నారు, ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు, ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీవిద్యను అంగన్వాడి కేంద్రాల్లోనే నిర్వహించాలన్నారు, విద్యా బోధనా బాధ్యతను అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కు ఇవ్వాలన్నారు, ఇంగ్లీష్ మీడియం విద్యకు వ్యతిరేకం కాదని ఐసిడిఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయన్నారు, ఆరు సంవత్సరాల లోపు పిల్లల మానసిక ,శారీరక ఎదుగుదల లో కీలకపాత్ర పోషిస్తున్న ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా ఉందన్నారు, ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు కావలసింది విద్య ఒకటే కాదని విద్య కంటే పౌష్టికాహారం అత్యంత ముఖ్యమైందన్నారు, 50 సంవత్సరాల క్రితం ఐసిడిఎస్ ఏర్పడిందన్నారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంతో శారీరక, మానసిక ఎదుగుదల అభివృద్ధి జరగకపోతే జీవితాంతం అంగవైకల్యంతో పిల్లలు బాధపడవలసి వస్తుందన్నారు, ప్రభుత్వాలు తీసుకుంటూన నిర్ణయంతో భావితరాల అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నయన్నారు, ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్లకు బోధించే బాధ్యత ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశాడు లేని పక్షంలో ప్రభుత్వం పైన పోరాటం నిర్వహిస్తామని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు జిల్లా పోలీసు కార్యాలయం, సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన, తేది: 26.09.2025
Published On
By KLINKARA NEWS
జిల్లా పోలీసు కార్యాలయం, సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన, తేది: 26.09.2025• రానున్న 48 గంటలు భారీ వర్షాల దృష్ట్యా జిల్లాకు ఎల్లో అలర్ట్.. • లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..• అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదు.. • పొంగిపోర్లే వాగులు, వంకలను చూడటానికి వెళ్లకూడదు, దాటడానికి ప్రయత్నించకూడదు..• అత్యవసర సమయంలో డైల్ - 100 లేదా లోకల్ పోలీసులకు సమాచారం అందించండి..• జిల్లా ప్రజల భద్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు.. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా.. నిన్న సాయంకాలం నుండి ఎడతెరిపి లేకుండా కుండపోతాల కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని, పురాతన - శితిలావస్తాలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండరాదని జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు సూచించారు. పొంగిపోర్లే వాగులను, వంకలను చూడటానికి వెళ్లకూడదని, దాటాడానికి ప్రయత్నించకూడదని, జలాశయాలు నిండు కుండలా మారి ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉంటుందని అన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, చెరువులు కుంటల వద్దకు ఎవ్వరూ వెళ్ళకుండా ప్రమాద సూచిక బోర్డులను, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించడం జరిగింది అత్యవసర సమయంలో డైల్ 100 లేదా సమీప పోలీసు స్టేషన్ కు సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు సూచించారు. భారీ వర్షాల దృష్ట్యా పాటించవలసిన జాగ్రత్తలు:. లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి.• అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదు. • ప్రమాద కారణాల దృష్ట్యా చెరువులు, కుంటలను చూడటానికి వెళ్లారాదు.• రైతులు పొలాలో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలి. • విద్యుత్ స్తంభాలను గాని, వైర్లను కానీ చేతులతో తాకకకూడదు. • నీరు నిలువ ఉన్న విద్యుత్ స్తంభాల దగ్గర నుండి వెళ్లారాదు. • వాగులు వంకలు బ్రిడ్జ్ లపై నుండి పొంగి, పొరలే సమయంలో దాటాడానికి ప్రయత్నించరాదు. • పాడైన పాత భవనాల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల ప్రక్కన నివాసం ఉండరాదు. దమ్మపేటలో పారిశుద్ధ్యం లోపించినది క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 25 గ్రామములోనీ బజారులు చెత్తాచెదారంలో దర్శనమీస్తున్నవి
Published On
By KLINKARA NEWS
దమ్మపేటలో పారిశుద్ధ్యం లోపించినదిక్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 25గ్రామములోనీ బజారులు చెత్తాచెదారంలో దర్శనమీస్తున్నవి బ్లీచింగ్ చల్లిన బాపతే లేదు...ఒకసారి బ్లీచింగ్ వాసన చూపించండి సెక్రెటరీ బీజేపీ నాయకులు తంబల్ల రవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో బిజెపి నాయకులు తంబళ్ల రవి మాట్లాడుతూ దమ్మపేట టౌన్ లోని వివిధ కాలనీలలో బజార్లు అన్ని చెత్తా చెదారంతో నిండి ఉన్నవి పట్టించుకునే అధికారులే లేరు,ఇప్పటి వరకు బ్లీచింగ్ చల్లిన బాపతే లేదు...మాకు ఒకసారి అన్న బ్లీచింగ్ వాసన చూపించండి మహాప్రభో అని కోరారు,వర్షా కాలం వచ్చి చాలా రోజులు అవుతుంది అయినా కూడా ఇప్పటి వరకు శానిటేషన్ చేసినధి లేదు,దోమల మందు కొట్టినది లేదు,అక్కడక్కడ రోడ్ల పక్కన చెత్తా చెదారం పేరుకుపోయి వాసన వెదజల్లుతున్నవి,గ్రామములో కొన్ని చోట్ల నీరు నిలువ ఉండి ఉన్నవి నీరు నిల్వ ఉండడం వల్ల విష జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నది కావున తక్షణమే అధికారులు స్పందించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టగలరని బిజెపి నాయకులు తంబళ్ల రవి కోరారు. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన నెట్‌వర్క్ అవసరం – టీఎసీ సభ్యుడు పల్లెల రామలక్ష్మయ్య డిమాండ్
Published On
By KLINKARA NEWS
గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన నెట్‌వర్క్ అవసరం – టీఎసీ సభ్యుడు పల్లెల రామలక్ష్మయ్య డిమాండ్ క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 25కొత్త టవర్లు, 4జీ సమస్యల పరిష్కారమే లక్ష్యం – టీఎసీ సమావేశంలో పల్లెల రామలక్ష్మయ్య ప్రస్తావన అశ్వారావుపేట, సెప్టెంబర్ 25 :ఖమ్మం ఎంపీ కార్యాలయంలో బీఎస్‌ఎన్ఎల్ ఆధ్వర్యంలో టెలికం అడ్వైజరీ కమిటీ (TAC) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీఎసీ సభ్యుడు పల్లెల రామలక్ష్మయ్య పాల్గొని పలు కీలక అంశాలను ప్రస్తావించారు. అశ్వారావుపేట మండలంలోని అనేక గ్రామాల్లో బీఎస్‌ఎన్ఎల్ నెట్‌వర్క్ సదుపాయాలు సరిగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన గుర్తుచేశారు. ముఖ్యంగా కొత్త బీఎస్‌ఎన్ఎల్ టవర్లు ఏర్పాటు చేయడం అత్యవసరమని సూచించారు. అలాగే ప్రస్తుతం ఉన్న టవర్లలో 4జీ నెట్‌వర్క్ సమస్యలు ఎక్కువగా ఉండడం వల్ల వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ప్రజలకు మెరుగైన కమ్యూనికేషన్ సేవలు అందించడానికి వినియోగదారుల విన్నపాలను ముందుకు తీసుకువస్తూ వాటిని త్వరితగతిన పరిష్కరించాలని బీఎస్‌ఎన్ఎల్ అధికారులను పల్లెల రామలక్ష్మయ్య కోరారు. సమావేశంలో ఈ సూచనలను అధికారులు గమనించి ఆచరణలోకి తీసుకురావాలని హామీ ఇచ్చినట్లు సమాచారం. క్లింకార న్యూస్: ఏ పార్టీతోనూ కలిసే ప్రసక్తే లేదు: కిషన్ రెడ్డి
Published On
By KLINKARA NEWS
క్లింకార న్యూస్:ఏ పార్టీతోనూ కలిసే ప్రసక్తే లేదు: కిషన్ రెడ్డిTG: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఒంటరిగానే ముందుకెళ్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. తాము ఏ పార్టీతోనూ కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. BC రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలోనిది కాదని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు అమలు చేయాలని తెలిపారు. భారత్ లో జెన్ జీ ఉద్యమం వస్తుందని KTR చేసిన దేశద్రోహ వ్యాఖ్యలను ప్రజలు ఖండించాలన్నారు. 