జిల్లా పోలీసు కార్యాలయం, సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన, తేది: 26.09.2025
జిల్లా పోలీసు కార్యాలయం,
సంగారెడ్డి జిల్లా.
పత్రిక ప్రకటన, తేది: 26.09.2025
• రానున్న 48 గంటలు భారీ వర్షాల దృష్ట్యా జిల్లాకు ఎల్లో అలర్ట్..
• లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
• అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదు..
• పొంగిపోర్లే వాగులు, వంకలను చూడటానికి వెళ్లకూడదు, దాటడానికి ప్రయత్నించకూడదు..
• అత్యవసర సమయంలో డైల్ - 100 లేదా లోకల్ పోలీసులకు సమాచారం అందించండి..
• జిల్లా ప్రజల భద్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు..
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా.. నిన్న సాయంకాలం నుండి ఎడతెరిపి లేకుండా కుండపోతాల కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని, పురాతన - శితిలావస్తాలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండరాదని జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు సూచించారు.
పొంగిపోర్లే వాగులను, వంకలను చూడటానికి వెళ్లకూడదని, దాటాడానికి ప్రయత్నించకూడదని, జలాశయాలు నిండు కుండలా మారి ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉంటుందని అన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, చెరువులు కుంటల వద్దకు ఎవ్వరూ వెళ్ళకుండా ప్రమాద సూచిక బోర్డులను, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించడం జరిగింది అత్యవసర సమయంలో డైల్ 100 లేదా సమీప పోలీసు స్టేషన్ కు సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు సూచించారు.
భారీ వర్షాల దృష్ట్యా పాటించవలసిన జాగ్రత్తలు:
. లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి.
• అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదు.
• ప్రమాద కారణాల దృష్ట్యా చెరువులు, కుంటలను చూడటానికి వెళ్లారాదు.
• రైతులు పొలాలో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలి.
• విద్యుత్ స్తంభాలను గాని, వైర్లను కానీ చేతులతో తాకకకూడదు.
• నీరు నిలువ ఉన్న విద్యుత్ స్తంభాల దగ్గర నుండి వెళ్లారాదు.
• వాగులు వంకలు బ్రిడ్జ్ లపై నుండి పొంగి, పొరలే సమయంలో దాటాడానికి ప్రయత్నించరాదు.
• పాడైన పాత భవనాల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల ప్రక్కన నివాసం ఉండరాదు.
Comment List