గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన నెట్‌వర్క్ అవసరం – టీఎసీ సభ్యుడు పల్లెల రామలక్ష్మయ్య డిమాండ్
గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన నెట్‌వర్క్ అవసరం – టీఎసీ సభ్యుడు పల్లెల రామలక్ష్మయ్య డిమాండ్
క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 25
కొత్త టవర్లు, 4జీ సమస్యల పరిష్కారమే లక్ష్యం – టీఎసీ సమావేశంలో పల్లెల రామలక్ష్మయ్య ప్రస్తావన
అశ్వారావుపేట, సెప్టెంబర్ 25 :ఖమ్మం ఎంపీ కార్యాలయంలో బీఎస్‌ఎన్ఎల్ ఆధ్వర్యంలో టెలికం అడ్వైజరీ కమిటీ (TAC) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీఎసీ సభ్యుడు పల్లెల రామలక్ష్మయ్య పాల్గొని పలు కీలక అంశాలను ప్రస్తావించారు. అశ్వారావుపేట మండలంలోని అనేక గ్రామాల్లో బీఎస్‌ఎన్ఎల్ నెట్‌వర్క్ సదుపాయాలు సరిగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన గుర్తుచేశారు. ముఖ్యంగా కొత్త బీఎస్‌ఎన్ఎల్ టవర్లు ఏర్పాటు చేయడం అత్యవసరమని సూచించారు. అలాగే ప్రస్తుతం ఉన్న టవర్లలో 4జీ నెట్‌వర్క్ సమస్యలు ఎక్కువగా ఉండడం వల్ల వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ప్రజలకు మెరుగైన కమ్యూనికేషన్ సేవలు అందించడానికి వినియోగదారుల విన్నపాలను ముందుకు తీసుకువస్తూ వాటిని త్వరితగతిన పరిష్కరించాలని బీఎస్‌ఎన్ఎల్ అధికారులను పల్లెల రామలక్ష్మయ్య కోరారు. సమావేశంలో ఈ సూచనలను అధికారులు గమనించి ఆచరణలోకి తీసుకురావాలని హామీ ఇచ్చినట్లు సమాచారం.
Comment List