స్థానిక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆప్ ఇండియా అభ్యర్థులను బరిలోకి దింపుతాం............. ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు అలిగే జీవన్
స్థానిక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆప్ ఇండియా అభ్యర్థులను బరిలోకి దింపుతాం............. ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు అలిగే జీవన్
సంగారెడ్డి జిల్లా రానున్న స్థానిక ఎన్నికల్లో RPI నుంచి జడ్పీటీసీ, ఎంపిటిసి, సర్పంచ్, వార్డు మెంబర్ల ను బరిలోకి దింపుతామని ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు, న్యాయవాది అలిగే జీవన్ తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ RPI రాష్ట్ర అధ్యక్షులు ప్రొపెసర్ గాలి వినోద్ కుమార్ ఆదేశాల మేరకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతామని బీసీలకు 50%, ఎస్సి, ఎస్టీ, మత మైనారిటీ, అగ్రకుల పేదలకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. కాంగ్రెస్, బీఆరెస్, బీజేపీ పార్టీ లు పేదలకు అధికారం దూరం చేస్తున్నాయని, ఎన్నికలు అంటే కోట్ల రూపాయలు ఖర్చు చేయాలనీ పేద వర్గాల ను ఎన్నికల్లో పాల్గొనకుండ డబ్బు రాజకీయం ఇక సాగదని అన్నారు. ప్రజల కు సేవ చేసే యువ నాయకులు, సామాజిక సేవకులు, విద్యావంతులు, మేధావులు, ఎన్నికల్లో పోటీలో ఉండాలని కోరారు. ధనవంతులు ఎన్నికల్లో ఓట్లు కొని ప్రజా ధనం లూటి చేస్తున్నారని ఆరోపించారు. సమసమాజం నిర్మాణం కావాలంటే సేవా దృక్పధం కలిగిన వ్యక్తులు ఎన్నికల్లో గెలుపొందాలని, త్వరలో నే అభ్యర్థులను ఎంపిక చేస్తామని అలిగే జీవన్ తెలిపారు.
Comment List