ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

క్లింకార న్యూస్: సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తుల

క్లింకార న్యూస్: సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తుల క్లింకార న్యూస్:సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తులఉమ్మడి మెదక్ జిల్లాలో 251 మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరి కిషన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సంగారెడ్డి జిల్లాలో 101, మెదక్ జిల్లాలో 47, సిద్దిపేట జిల్లాలో 93 దుకాణాలు కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 23న డ్రా తీస్తారు. ఒక్కో దుకాణానికి రూ. 3 లక్షల టెండర్ ఫీజు చెల్లించాలని, ఇది తిరిగి చెల్లించబడదని ఆయన వివరించారు.
Read More...
తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

వట్ పల్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కుల పంపి

వట్ పల్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కుల పంపి వట్ పల్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కుల పంపిణీ. తెలంగాణ రాష్ట్ర సీఎం రెవంత్ రెడ్డి గారి సహకారంతో మంత్రి దామోదర్ రాజనర్సింహ సార్ గారి ఆదేశానుసారం వట్ పల్లి మండలంలో కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కులు మొత్తం 56 మందికి 56,06,496 రూ,,ల చెక్కులు ఇవ్వడం జరిగింది. కల్యాణ లక్ష్మి 48 షాది ముబారక్ 08 చెక్కులు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో MRO చంద్రశేఖర్ సార్, TPCC ఉపాధ్యక్షులు సంగమేశ్వర్ సార్ గారు, వట్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రతాప్ రమేష్ జోషి సార్ గారు, ATMA కమిటీ చైర్మన్ కచూర్ రావు సార్ గారు, వివిధ గ్రామాల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ మెంబర్ లు, యువజన నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Read More...
జాతీయ  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను అరెస్టు చేస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను  అమలు చేయకపోతే....  పోరాటాలను ఉదృతం చేస్తాం? 

ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను అరెస్టు చేస్తారా  కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను  అమలు చేయకపోతే....  పోరాటాలను ఉదృతం చేస్తాం?  ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను అరెస్టు చేస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకపోతే.... పోరాటాలను ఉదృతం చేస్తాం?   అక్రమ అరెస్టులపై ఉన్న దృష్టి రాష్ట్ర ప్రభుత్వానికి సమస్యలపై దృష్టి ఎందుకు లేదు? ప్రజా పాలన అంటే అక్రమ అరెస్టుల? సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి సాయిలు డిమాండ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకపోతే పోరాటాలను ఉదృతం చేస్తాం అంగన్వాడీ టీచర్లను అక్రమ అరెస్టును ఖండించండి అక్రమ అరెస్టులపై ఉన్న దృష్టి రాష్ట్ర ప్రభుత్వానికి సమస్యలపై దృష్టి ఎందుకు లేదు-?ప్రజా పాలన అంటే అక్రమ అరెస్టులా అని  సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి సాయిలు అన్నారు ఈరోజు సీఐటీయూ నాయకులను అక్రమంగా ఉదయం 4 గంటల నుండి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో దిగ్బంధించడం చాలా దారుణం అని అన్నారు అక్రమంగా అరెస్టు అయిన అంగన్వాడి  టీచర్లను వెంటనే విడుదల చెయ్యాలి ఈ సందర్భంగా సీఐటీయూ  జిల్లా కార్యదర్శి జి, సాయిలు  మాట్లాడుతూ  జిల్లాలో అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని  ప్రశాంతంగా వెళుతున్న అంగన్వాడీ టీచర్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం చాలా దారుణం అని అన్నారు ఇండ్లలో వెళ్లి సెంటర్లకు వెళ్లి అరెస్టు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారుమహిళలని చూడకుండా ఇబ్బందులకు గురిచేస్తూ, బలవంతంగా ఒత్తిడి చేసి అరెస్టు చేయడం ఏ రకమైన ప్రజా పాలన అవుతుం ది...?? ప్రభుత్వం. పోలీస్ యంత్రాంగం ఆలోచించాలి. అర్ధరాత్రి నుండి మహిళలు అని చూడకుండా అరెస్టులు చేసి మండలాలలో పోలీస్స్టేషన్లో నిర్బంధించారు.   ఎన్నికల సందర్భంగా  రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల కార్మికుల సమస్యలను పరిష్కారం చేస్తాం  కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే  కనీస వేతనాలు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు ఎన్నికల హామీని ఇప్పటివరకు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి టీచర్లు, కార్యకర్తలు  కొద్దిరోజులుగా ప్రీ ప్రైమరీ పాఠశాలలను అంగన్వాడిలకు అప్పగించాలని పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రావడం లేదన్నారు,       మహిళా ఉద్యోగులు తామ గోడు వెల్లబోసుకున్న పెడచెవిన పెడుతుందన్నారు, ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ ఇంగ్లీష్ మీడియం విద్య పేరుతో ఐదు సంవత్సరాల లోపు పిల్లలను విద్యాశాఖకు అప్పగించడం అన్యాయమన్నారు, ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు, ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ  ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీవిద్యను అంగన్వాడి కేంద్రాల్లోనే నిర్వహించాలన్నారు, విద్యా బోధనా బాధ్యతను అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కు ఇవ్వాలన్నారు, ఇంగ్లీష్ మీడియం విద్యకు వ్యతిరేకం కాదని ఐసిడిఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయన్నారు, ఆరు సంవత్సరాల లోపు పిల్లల మానసిక ,శారీరక ఎదుగుదల లో కీలకపాత్ర పోషిస్తున్న ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా ఉందన్నారు, ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు కావలసింది విద్య ఒకటే కాదని విద్య కంటే పౌష్టికాహారం అత్యంత ముఖ్యమైందన్నారు, 50 సంవత్సరాల క్రితం ఐసిడిఎస్ ఏర్పడిందన్నారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంతో  శారీరక, మానసిక ఎదుగుదల అభివృద్ధి జరగకపోతే జీవితాంతం అంగవైకల్యంతో పిల్లలు బాధపడవలసి వస్తుందన్నారు, ప్రభుత్వాలు తీసుకుంటూన నిర్ణయంతో భావితరాల అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నయన్నారు, ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్లకు బోధించే బాధ్యత ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశాడు లేని పక్షంలో ప్రభుత్వం పైన పోరాటం నిర్వహిస్తామని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు
Read More...
తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

జిల్లా పోలీసు కార్యాలయం,           సంగారెడ్డి జిల్లా.  పత్రిక ప్రకటన, తేది: 26.09.2025

జిల్లా పోలీసు కార్యాలయం,           సంగారెడ్డి జిల్లా.  పత్రిక ప్రకటన, తేది: 26.09.2025 జిల్లా పోలీసు కార్యాలయం,          సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన, తేది: 26.09.2025•    రానున్న 48 గంటలు భారీ వర్షాల దృష్ట్యా జిల్లాకు ఎల్లో అలర్ట్..  •    లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..•    అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదు.. •    పొంగిపోర్లే వాగులు, వంకలను చూడటానికి వెళ్లకూడదు, దాటడానికి ప్రయత్నించకూడదు..•    అత్యవసర సమయంలో డైల్ - 100 లేదా లోకల్ పోలీసులకు సమాచారం అందించండి..•    జిల్లా ప్రజల భద్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు..   బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా.. నిన్న సాయంకాలం నుండి ఎడతెరిపి లేకుండా కుండపోతాల కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని, పురాతన - శితిలావస్తాలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండరాదని జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు సూచించారు. పొంగిపోర్లే వాగులను, వంకలను చూడటానికి వెళ్లకూడదని, దాటాడానికి ప్రయత్నించకూడదని, జలాశయాలు నిండు కుండలా మారి ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉంటుందని అన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, చెరువులు కుంటల వద్దకు ఎవ్వరూ వెళ్ళకుండా ప్రమాద సూచిక బోర్డులను, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించడం జరిగింది అత్యవసర సమయంలో డైల్ 100 లేదా సమీప పోలీసు స్టేషన్ కు సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు సూచించారు. భారీ వర్షాల దృష్ట్యా పాటించవలసిన జాగ్రత్తలు:.      లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి.•    అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదు. •    ప్రమాద కారణాల దృష్ట్యా చెరువులు, కుంటలను చూడటానికి వెళ్లారాదు.•    రైతులు పొలాలో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలి. •    విద్యుత్ స్తంభాలను గాని, వైర్లను కానీ చేతులతో తాకకకూడదు. •    నీరు నిలువ ఉన్న విద్యుత్ స్తంభాల దగ్గర నుండి వెళ్లారాదు. •    వాగులు వంకలు బ్రిడ్జ్ లపై నుండి పొంగి, పొరలే సమయంలో దాటాడానికి ప్రయత్నించరాదు. •    పాడైన పాత భవనాల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల ప్రక్కన నివాసం ఉండరాదు.
Read More...
తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

దమ్మపేటలో పారిశుద్ధ్యం లోపించినది క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 25 గ్రామములోనీ బజారులు చెత్తాచెదారంలో దర్శనమీస్తున్నవి

దమ్మపేటలో పారిశుద్ధ్యం లోపించినది క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 25 గ్రామములోనీ బజారులు చెత్తాచెదారంలో దర్శనమీస్తున్నవి దమ్మపేటలో పారిశుద్ధ్యం లోపించినదిక్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 25గ్రామములోనీ బజారులు చెత్తాచెదారంలో దర్శనమీస్తున్నవి బ్లీచింగ్ చల్లిన బాపతే లేదు...ఒకసారి బ్లీచింగ్ వాసన చూపించండి సెక్రెటరీ  బీజేపీ నాయకులు తంబల్ల రవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో బిజెపి నాయకులు తంబళ్ల రవి మాట్లాడుతూ దమ్మపేట టౌన్ లోని వివిధ కాలనీలలో బజార్లు అన్ని చెత్తా చెదారంతో నిండి ఉన్నవి పట్టించుకునే అధికారులే లేరు,ఇప్పటి వరకు బ్లీచింగ్ చల్లిన బాపతే లేదు...మాకు ఒకసారి అన్న బ్లీచింగ్ వాసన చూపించండి మహాప్రభో అని కోరారు,వర్షా కాలం వచ్చి చాలా రోజులు అవుతుంది అయినా కూడా ఇప్పటి వరకు శానిటేషన్ చేసినధి లేదు,దోమల మందు కొట్టినది లేదు,అక్కడక్కడ రోడ్ల పక్కన చెత్తా చెదారం పేరుకుపోయి వాసన వెదజల్లుతున్నవి,గ్రామములో కొన్ని చోట్ల నీరు నిలువ ఉండి ఉన్నవి నీరు నిల్వ ఉండడం వల్ల విష జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నది కావున తక్షణమే అధికారులు స్పందించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టగలరని బిజెపి నాయకులు తంబళ్ల రవి కోరారు.
Read More...
తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన నెట్‌వర్క్ అవసరం – టీఎసీ సభ్యుడు పల్లెల రామలక్ష్మయ్య డిమాండ్

గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన నెట్‌వర్క్ అవసరం – టీఎసీ సభ్యుడు పల్లెల రామలక్ష్మయ్య డిమాండ్ గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన నెట్‌వర్క్ అవసరం – టీఎసీ సభ్యుడు పల్లెల రామలక్ష్మయ్య డిమాండ్ క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 25కొత్త టవర్లు, 4జీ సమస్యల పరిష్కారమే లక్ష్యం – టీఎసీ సమావేశంలో పల్లెల రామలక్ష్మయ్య ప్రస్తావన అశ్వారావుపేట, సెప్టెంబర్ 25 :ఖమ్మం ఎంపీ కార్యాలయంలో బీఎస్‌ఎన్ఎల్ ఆధ్వర్యంలో టెలికం అడ్వైజరీ కమిటీ (TAC) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీఎసీ సభ్యుడు పల్లెల రామలక్ష్మయ్య పాల్గొని పలు కీలక అంశాలను ప్రస్తావించారు. అశ్వారావుపేట  మండలంలోని అనేక గ్రామాల్లో బీఎస్‌ఎన్ఎల్ నెట్‌వర్క్ సదుపాయాలు సరిగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన గుర్తుచేశారు. ముఖ్యంగా కొత్త బీఎస్‌ఎన్ఎల్ టవర్లు ఏర్పాటు చేయడం అత్యవసరమని సూచించారు. అలాగే ప్రస్తుతం ఉన్న టవర్లలో 4జీ నెట్‌వర్క్ సమస్యలు ఎక్కువగా ఉండడం వల్ల వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ప్రజలకు మెరుగైన కమ్యూనికేషన్ సేవలు అందించడానికి వినియోగదారుల విన్నపాలను ముందుకు తీసుకువస్తూ వాటిని త్వరితగతిన పరిష్కరించాలని బీఎస్‌ఎన్ఎల్ అధికారులను పల్లెల రామలక్ష్మయ్య కోరారు. సమావేశంలో ఈ సూచనలను అధికారులు గమనించి ఆచరణలోకి తీసుకురావాలని హామీ ఇచ్చినట్లు సమాచారం.
Read More...
జాతీయ  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

క్లింకార న్యూస్: ఏ పార్టీతోనూ కలిసే ప్రసక్తే లేదు: కిషన్ రెడ్డి

క్లింకార న్యూస్: ఏ పార్టీతోనూ కలిసే ప్రసక్తే లేదు: కిషన్ రెడ్డి క్లింకార న్యూస్:ఏ పార్టీతోనూ కలిసే ప్రసక్తే లేదు: కిషన్ రెడ్డిTG: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఒంటరిగానే ముందుకెళ్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. తాము ఏ పార్టీతోనూ కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. BC రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలోనిది కాదని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు అమలు చేయాలని తెలిపారు. భారత్ లో జెన్ జీ ఉద్యమం వస్తుందని KTR చేసిన దేశద్రోహ వ్యాఖ్యలను ప్రజలు ఖండించాలన్నారు.
Read More...
తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

నారాయణఖేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రేపు మెగా పేరెంట్స్ మీటింగ్ కలదు జ్ఞాన వార్త నారాయణఖేడ్ ప్రతినిధి..

నారాయణఖేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రేపు మెగా పేరెంట్స్ మీటింగ్ కలదు జ్ఞాన వార్త నారాయణఖేడ్ ప్రతినిధి.. నారాయణఖేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రేపు మెగా పేరెంట్స్ మీటింగ్ కలదుజ్ఞాన వార్త నారాయణఖేడ్ ప్రతినిధి..నారాయణఖేడ్ పట్టణంలో, ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల లో, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆదేశాలను అనుసరించి, మెగా పేరెంట్స్ మీటింగ్ 26.9.2025,, నాడు ఉదయం 10.30 మధ్యాహ్నం 1.00 గంటల వరకు పేరెంట్స్ మీటింగ్ ఉంటుందని, కాలేజ్ ప్రిన్సిపల్ ఉమామహేశ్వర్ తెలిపారు. ఇటీవల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు అయిన సంస్కరణలు ల్యాబ్ మెటీరియల్, స్పోర్ట్స్ మెటీరియల్, పంపిణీ మరియు విద్యార్థుల స్పెషల్ రికగ్నిటెషన్, అటెన్ డేన్స్, పోటీ పరీక్షల నిట్, ఎంసెట్ లకు సంబంధించి. ఫెసిక్స్క్స్, ఖానావాలా, క్లాట్ ఎగ్జామ్ ల ఆన్లైన్ క్లాస్లు జరుగుచున్నవి. మరియు హెల్ప్ ప్రోగ్రామ్ లో భాగంగా ధ్యానము, మానసిక ఒత్తిడి నివారణ, కళాశాల విద్యార్థి విద్యార్థులకు ఉపయుక్తంగా ఉన్నాయి. అదే సమయంలో కళాశాలలకు డిజిటల్ క్లాసెస్ త్వరలో ప్రారంభం కానున్నాయి. వీటిలో భాగంగా తల్లిదండ్రులు విలువైన సూచనలు సలహాలు తీసుకుంటూ, వారి పిల్లల విద్యా ప్రగతిని, అకాడమిక్ పురోగతిని తెలపడంలో భాగంగా ఈ సమావేశం ఏర్పాటుకు తప్పకుండా రావాలని కాలేజీ ప్రిన్సిపల్ ఉమామహేశ్వర్, తోపాటు ఉపాధ్యాయ బృందం, సత్యనారాయణ, విట్టల్, ఓం ప్రకాష్, బసవరాజ్, రమేష్, ఉపాధ్యాయురాలు కవిత, గంగాధర్, జ్ఞానేశ్వర్, మోహన్, హనుమంతు, ఇమ్రాన్, విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులు తప్పకుండా రావాలని తెలపడం జరిగింది.
Read More...
తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

చంద్రాపూర్ లో రాశి అమేజ్ కంపిని వారి పత్తి రకం పై రైతులకు అవగాహన సదస్సు నారాయణాఖేడ్ నియోజకవర్గం (క్లింకారా న్యూస్, సెప్టెంబర్ 25)

చంద్రాపూర్ లో రాశి అమేజ్ కంపిని వారి పత్తి రకం పై రైతులకు అవగాహన సదస్సు  నారాయణాఖేడ్ నియోజకవర్గం (క్లింకారా న్యూస్, సెప్టెంబర్ 25) చంద్రాపూర్ లో రాశి అమేజ్ కంపిని వారి పత్తి రకం పై రైతులకు అవగాహన సదస్సు నారాయణాఖేడ్ నియోజకవర్గం(క్లింకారా న్యూస్, సెప్టెంబర్ 25) నారాయణఖేడ్ మండలంలోని చందాపూర్ గ్రామంలో రైతు సంజీవ రెడ్డి పొలంలో బుధవారం రాశి కంపెనీ ఆధ్వర్యంలో RBM LV ప్రసాద్ టెర్రిట్టారీ మేనేజర్ నాగేశ్వర్ రావు పీఓ వైజనాథ్ రాశి అమేజ్ పత్తి రకం పై గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో 75 మంది రైతులు పాల్గొన్నారు.  ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యస్థం నుండి బరువైన నేలలకు అనుకూలం ఉంటుందని, రెండవ పంటకు సరైన ఎంపిక అని తెలిపారు. త్వరగా కాపుకి చేరుతుంది. కేవలం 2 కొతలలోనే అధిక దిగుబడి ఉంటుందని, రసం పీల్చు పురుగులను సమర్థవంతంగా తట్టుకుంటుందని తెలిపారు.
Read More...
తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

క్లింకారా న్యూస్: సదాశివపేట: మహిళల ఆర్థిక, సామాజిక స్థాయి బలోపేతం చేయాలి

క్లింకారా న్యూస్: సదాశివపేట: మహిళల ఆర్థిక, సామాజిక స్థాయి బలోపేతం చేయాలి క్లింకారా న్యూస్:సదాశివపేట: మహిళల ఆర్థిక, సామాజిక స్థాయి బలోపేతం చేయాలి పోషణ మాస ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సదాశివపేటలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు పద్మజారమణ మాట్లాడుతూ, మహిళల ఆర్థిక, సామాజిక స్థాయిని బలోపేతం చేయాలని, వారి విద్య, ఉపాధి, ఆరోగ్య రంగాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, ప్రత్యేక అధికారులు భార, తి నిత్య, సునీత, సీడీపీఓ చంద్రకళ పాల్గొన్నారు.
Read More...
తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

జిల్లా పోలీసు కార్యాలయం, సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన తేది: 24.09.2025,

జిల్లా పోలీసు కార్యాలయం,    సంగారెడ్డి జిల్లా.  పత్రిక ప్రకటన తేది: 24.09.2025, జిల్లా పోలీసు కార్యాలయం,   సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన తేది: 24.09.2025, సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) గా భాద్యతలు స్వీకరించిన శ్రీ సి.హెచ్. రఘునందన్ రావు, అదనపు.ఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన, పుష్పగుచ్చం అందజేసిన సంగారెడ్డి జిల్లా రిటైర్డ్ పోలీసు అధికారుల సంఘం సభ్యులు.. అదనపు ఎస్పీ గారిని కలిసిన వారిలో బి ఎల్లయ్య ప్రెసిడెంట్, యం. మహేష్ జనేరల్ సెక్రెటరీ, సభ్యులు ఎ. ప్రభాకర్ రావ్, సయ్యద్ జహింగీర్, ప్రభాకర్ రెడ్డి, మల్లికార్జున్, సురేష్, జీవన, కిష్టయ్య, మాణిక్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Read More...
తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

జిల్లా పోలీసు కార్యాలయం, సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన తేది: 24-09-2025

జిల్లా పోలీసు కార్యాలయం,       సంగారెడ్డి జిల్లా.   పత్రిక ప్రకటన తేది: 24-09-2025 జిల్లా పోలీసు కార్యాలయం,      సంగారెడ్డి జిల్లా.  పత్రిక ప్రకటన తేది: 24-09-2025 •    వార్షిక తనిఖీలలో భాగంగా నారాయణఖేడ్ పోలీసు స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ..•    స్టేషన్ పరిసరాల శుభ్రత, రికార్డ్స్ మెంటేనేన్స్, క్రైమ్ వెహికల్స్, సిబ్బంది కిట్ ఆర్టికల్స్ తనిఖీ : జిల్లా ఎస్పి శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు. వార్షిక తనిఖీలలో భాగంగా ఈ రోజు తేది: 24-09-2025 నాడు నారాయణఖేడ్ పోలీసు స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పి శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు, నారాయణఖేడ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, డిఎస్పీ గారితో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు.. అనంతరం స్టేషన్ పరిసరాల శుభ్రత, సిబ్బంది కిట్ ఆర్టికల్స్, సీజ్ చేసిన క్రైమ్ వెహికిల్స్ ను తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డ్ లను తనిఖీ చేస్తూ, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల చేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేస్తూ భాదితులకు అండగా నిలవాలని అన్నారు. ఇన్వెస్టిగేషన్ లో సందేహాలుంటే.. ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని ఎస్.హెచ్.ఓ కు సూచనలు చేశారు. నేరాలు జరిగిన ప్రాంతాలను స్టేషన్ పార్ట్-II మ్యాప్ లో నమోదు చేయాలని, ఆస్థి సంబంధిత నేరాలు జరుగుతున్న ప్రాంతాలను “క్రైమ్ హాట్ స్పాట్స్” గా గుర్తించి, నిఘా కట్టుదిట్టం చేయాలని అన్నారు. స్టేషన్ పరిదిలో గల కేడి, సస్పెక్ట్, రౌడీ షీటర్ లను చెక్ చేస్తూ వారి కదలికలపై నిఘా ఉంచాలని అన్నారు.  రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి, వాహనాల వేగం అదుపునకు ర్యాంబుల్ స్ట్రిప్స్, ఇసుక డ్రమ్ములు, సూచిక బోర్డు లను ఏర్పాటు చేయాలని అన్నారు. సైబర్ నేరాల అదుపునకు విద్యాసంస్థలలో, పని ప్రదేశాలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. డైల్ -100 కాల్స్ కు బ్ల్యూ కోల్ట్స్, పెట్రో కార్ సిబ్బంది త్వరితగతిన స్పందించి, నేరాస్థలానికి చేరుకోవాలని, త్వరగా ఘటన స్థలానికి చేరుకోవడం వలన నేరం తీవ్రతను తగ్గించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. నేరాల అదుపులో, జరిగిన నేరాలను ఛేదించడంలో ఉపయోగపడే సిసి కెమెరాల ఏర్పాటు కృషి చేయాలన్నారు. స్టేషన్ రికార్డుల మెయింటనెన్స్, సిబ్బంది పని తీరు బాగుందని, ఎస్.హెచ్.ఓ విద్యాచరణ్ రెడ్డి, సిబ్బందిని ఎస్పి గారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ తనిఖీ లలో ఎస్పి గారి వెంబడి నారాయణఖేడ్ డియస్పి వెంకట్ రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సిసి విజయ్ పవార్ లు ఉన్నారు.
Read More...