*క్లింకారా న్యూస్- వట్పల్లి క్లింకారా న్యూస్ ప్రతినిధి Md మహబూబ్ అలి ఈ సంవత్సరం దసరా అలాయి బలాయి కార్యక్రమాన్ని వట్ పల్లిలో నిర్వహిస్తున్నారు.
*క్లింకారా న్యూస్- వట్పల్లి
క్లింకారా న్యూస్ ప్రతినిధి
Md మహబూబ్ అలి
ఈ సంవత్సరం దసరా అలాయి బలాయి కార్యక్రమాన్ని వట్ పల్లిలో నిర్వహిస్తున్నారు. అందోల్
నియోజకవర్గంలో గత ఏడు సంవత్సరాలుగా దసరా అలాయి బలాయి నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం అందోల్ జోగిపేట పట్టణంలో నిర్వహించగా ఈసారి వట్ పల్లి అప్పగారి ఆశ్రమం వెనకాల వున్న ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నారు. ఈకార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు గారు హాజరు కానున్నారు. అందుకు గాను ఏర్పాట్లను స్థానిక నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ గారు పరిశీలించారు. వారి వెంట మండల పార్టీ సీనియర్ నాయకులు వీరారెడ్డి మండల పార్టీ ప్రధానకార్యదర్శి శివాజీ రావు, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు అశోక్ గౌడ్, మండల పార్టీ నాయకులు బస్వరాజ్, బుద్దిరెడ్డి, గట్టుపల్లి వీరారెడ్డి, సుభాష్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు మధు, శ్రీనివాస్ గౌడ్, అబ్దుల్ ఘని, బూత్కూరు సంగమేశ్వర్, తాజా మాజీ సర్పంచ్ దీప్లా నాయక్, సుభాష్ నాయక్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు*
Comment List