లెర్న్ ఫర్ లైఫ్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
లెర్న్ ఫర్ లైఫ్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 20
అశ్వారావుపేట, సెప్టెంబర్ 18 :అశ్వారావుపేట మండలం, లెర్న్ ఫర్ లైఫ్ స్కూల్ లో ఎచ్ఎం కళ్యాణి ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిపారు.శనివారం పాఠశాల ఆవరణలో వివిధ రకాల పూలతో బతుకమ్మ ఆడారు. ఉత్సహంగా.. ఉల్లాసంగా బతుకమ్మ పాటలు పాడారు. అనతరం స్థానికంగా ఉన్న దొంతికుంట చెరువులో వాటిని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎచ్ఎం కల్యాణి మాట్లాడుతూ..ఇది తెలంగాణ మహిళల సాంస్కృతిక జీవితంలో భాగం కావాలన్నారు. ప్రకృతిలోని వివిధ రకాల పూలను ఉపయోగించి బతుకమ్మను అలంకరించడం వల్ల ప్రకృతి ఆరాధన, పర్యావరణంపై ప్రేమ తెలుస్తాయన్నారు. ఈ పండుగ కుటుంబ బంధాలను, ముఖ్యంగా మహిళల మధ్య స్నేహబంధాలను బలపరుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comment List