జిల్లా పోలీస్ కార్యాలయం, సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన, తేది: 20.09.2025,
జిల్లా పోలీస్ కార్యాలయం,
సంగారెడ్డి జిల్లా.
పత్రిక ప్రకటన, తేది: 20.09.2025,
• సంగారెడ్డి జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఇన్సినిరేషన్..
• 583-కిలోల ఎండు గంజాయి, 1.777 కిలోల ఆల్ప్రాజోలం, 980 గ్రాముల యం.డి.యం.ఎ ను ఇన్సినిరేషన్ ప్రక్రియ ద్వారా దహనం: జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. గారు.
సంగారెడ్డి జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో యన్.డి.పి.యస్. చట్ట ప్రకారం నమోదైన 20 కేసులలో సీజ్ చేయబడిన ప్రభుత్వ నిషేధిత 583-కిలోల ఎండు గంజాయి, 1.777 కిలోల ఆల్ప్రాజోలం, 980 గ్రాముల యం.డి.యం.ఎ ను చట్ట ప్రకారం కోర్టు అనుమతి తీసుకుని, జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు తేది: 20.09.2025 నాడు సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామిక వాడలలోని మెడీకేర్ పరిశ్రమలో ఇన్సినిరేషన్ ప్రక్రియ ద్వారా పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ దహనం చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. యన్.డి.పి.యస్. యాక్ట్ లోని నియమనిబంధనల ప్రకారం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నిల్వ ఉన్న ప్రభుత్వ నిషేదిత ఎండు గంజాయి, ఆల్ప్రాజోలం, యం.డి.యం.ఎ ను ఈ రోజు దహనం చేయడం జరిగిందని అన్నారు. కొందరు అక్రమార్జనలో భాగంగా అక్రమ ఆల్ప్రాజోలం తయారీ, గంజాయి సాగు, విక్రయిస్తూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ప్రలోభాలకు గురి చేస్తూ మత్తులోకి లాగుతున్నారని అన్నారు. జిల్లాలో అసాంఘీక, చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలను అరికట్టడానికి జిల్లాలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ టిమ్స్ జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ దాడులు చేపట్టడం జరిగిందని అన్నారు. జిల్లాలో ఎవరైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలను విక్రయించి, సరఫరా చేసినా, లేదా సాగు చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ డ్రగ్ డిస్పోజల్ కార్యక్రమంలో ఎస్పీ గారి వెంబడి సంగారెడ్డి డిఎస్పీ సత్యయ్యగౌడ్, పటాన్ చెర్వు డిఎస్పీ ప్రభాకర్, వర్టికల్ డిఎస్పీ సురేందర్ రెడ్డి, మెడికేర్ ఎన్విరాన్‌మెంటల్ పరిశ్రమ మేనేజర్ శివారెడ్డి, డీసిఆర్బీ ఇన్స్పెక్టర్ బి.రమేష్, ఎస్-న్యాబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావ్, పటాన్ చెర్వు ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి, భానూర్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, సంబంధిత ఎస్.హెచ్.ఓ. లు ఉన్నారు.
Comment List