పత్రిక - ప్రకటన రాజన్న సిరిసిల్ల జిల్లా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ CITU లో భారీ చేరికలు
పత్రిక - ప్రకటన
రాజన్న సిరిసిల్ల జిల్లా
యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ CITU లో భారీ చేరికలు
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కళ్యాణ లక్ష్మి గార్డెన్ లో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ CITU రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కర్నాల అనిల్ కుమార్ గారి అధ్యక్షతన ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది
ఈ సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ అసిస్టెంట్ హెల్పర్స్ ఈరోజు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ CITU అనుబంధ యూనియన్ లో 100 మందికి పైగా వివిధ సంఘాల నుండి చేరడం జరిగింది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి N. స్వామి , రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ V. గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి వీరికి కండువాలు కప్పి యూనియన్ లోకి ఆహ్వానించడం జరిగింది
ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఎన్. స్వామి , వి. గోవర్ధన్ గార్లు మాట్లాడుతూ సిరిసిల్ల విద్యుత్ సహకార సంస్థ సెస్ లో పనిచేస్తున్న కార్మికులకు 2018 లో అసిస్టెంట్ హెల్పర్ గా , 2020 లో ప్రొఫెషన్ పీరియడ్ డిక్లేర్ ఇవ్వడం జరిగిందని అసిస్టెంట్ హెల్పర్ల నుండి హెల్పర్లుగా ప్రమోషన్ ఇవ్వాల్సింది ఉండే కానీ 5 సంవత్సరాల నుండి ప్రమోషన్ ఇస్తామంటూ కాలయాపన చేస్తూ వస్తున్నారన్నారు సెస్ చైర్మన్ మరియు మేనేజ్మెంట్ కలగజేసుకొని అసిస్టెంట్ హెల్పర్లకు హెల్పర్ గా వెంటనే పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు
తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ గా అదేవిధంగా సంస్థ పరిరక్షణలో మేము ముఖ్య పాత్ర పోషిస్తామని ఈ సభాముఖంగా తెలియజేశారు సమావేశం అనంతరం సెస్ చైర్మన్ గారికి మరియు ఎండి గారికి వినతి పత్రాన్ని అందివ్వడం జరిగింది అనంతరం చైర్మన్ మరియు ఎండి గారు సానుకూలంగా స్పందించి వీరి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని పరిష్కారానికి మా వంతు మేం కృషి చేస్తామని తెలియజేయడం జరిగిందని తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ CITU పై నమ్మకంతో యూనియన్ లో చేరినందుకు వారందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సింగిరెడ్డి చంద్రారెడ్డి , యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి , కరీంనగర్ జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు సంతోష్ , శ్రీనివాస్ , ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు అంజనేయులు , నాయకులు కొమురయ్య , CITU రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , కార్యదర్శి కోడం రమణ గారు మరియు సెస్ అసిస్టెంట్ హెల్పర్స్ పాల్గొన్నారు
Comment List