ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను అరెస్టు చేస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను  అమలు చేయకపోతే....  పోరాటాలను ఉదృతం చేస్తాం? 

On
ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను అరెస్టు చేస్తారా  కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను  అమలు చేయకపోతే....  పోరాటాలను ఉదృతం చేస్తాం? 

ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను అరెస్టు చేస్తారా

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను 
అమలు చేయకపోతే.... 
పోరాటాలను ఉదృతం చేస్తాం? 

 అక్రమ అరెస్టులపై ఉన్న దృష్టి 
రాష్ట్ర ప్రభుత్వానికి
 సమస్యలపై దృష్టి ఎందుకు లేదు?

ప్రజా పాలన అంటే అక్రమ అరెస్టుల?

సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి సాయిలు డిమాండ్


కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను 
అమలు చేయకపోతే 
పోరాటాలను ఉదృతం చేస్తాం అంగన్వాడీ టీచర్లను అక్రమ అరెస్టును ఖండించండి అక్రమ అరెస్టులపై ఉన్న దృష్టి 
రాష్ట్ర ప్రభుత్వానికి
 సమస్యలపై దృష్టి ఎందుకు లేదు-?ప్రజా పాలన అంటే అక్రమ అరెస్టులా అని  సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి సాయిలు అన్నారు ఈరోజు సీఐటీయూ నాయకులను అక్రమంగా ఉదయం 4 గంటల నుండి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో దిగ్బంధించడం చాలా దారుణం అని అన్నారు అక్రమంగా అరెస్టు అయిన అంగన్వాడి  టీచర్లను వెంటనే విడుదల చెయ్యాలి


ఈ సందర్భంగా సీఐటీయూ  జిల్లా కార్యదర్శి జి, సాయిలు
  మాట్లాడుతూ  జిల్లాలో అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని  ప్రశాంతంగా వెళుతున్న అంగన్వాడీ టీచర్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం చాలా దారుణం అని అన్నారు ఇండ్లలో వెళ్లి సెంటర్లకు వెళ్లి అరెస్టు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు
మహిళలని చూడకుండా ఇబ్బందులకు గురిచేస్తూ, బలవంతంగా ఒత్తిడి చేసి అరెస్టు చేయడం ఏ రకమైన ప్రజా పాలన అవుతుం ది...?? ప్రభుత్వం. పోలీస్ యంత్రాంగం ఆలోచించాలి. అర్ధరాత్రి నుండి మహిళలు అని చూడకుండా అరెస్టులు చేసి మండలాలలో పోలీస్స్టేషన్లో నిర్బంధించారు.   ఎన్నికల సందర్భంగా  రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల కార్మికుల సమస్యలను పరిష్కారం చేస్తాం 
 కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే  కనీస వేతనాలు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు ఎన్నికల హామీని ఇప్పటివరకు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి టీచర్లు, కార్యకర్తలు  కొద్దిరోజులుగా ప్రీ ప్రైమరీ పాఠశాలలను అంగన్వాడిలకు అప్పగించాలని పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రావడం లేదన్నారు,       మహిళా ఉద్యోగులు తామ గోడు వెల్లబోసుకున్న పెడచెవిన పెడుతుందన్నారు, ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ ఇంగ్లీష్ మీడియం విద్య పేరుతో ఐదు సంవత్సరాల లోపు పిల్లలను విద్యాశాఖకు అప్పగించడం అన్యాయమన్నారు, ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు, ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు
 సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ  ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీవిద్యను అంగన్వాడి కేంద్రాల్లోనే నిర్వహించాలన్నారు, విద్యా బోధనా బాధ్యతను అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కు ఇవ్వాలన్నారు, ఇంగ్లీష్ మీడియం విద్యకు వ్యతిరేకం కాదని ఐసిడిఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయన్నారు, ఆరు సంవత్సరాల లోపు పిల్లల మానసిక ,శారీరక ఎదుగుదల లో కీలకపాత్ర పోషిస్తున్న ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా ఉందన్నారు, ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు కావలసింది విద్య ఒకటే కాదని విద్య కంటే పౌష్టికాహారం అత్యంత ముఖ్యమైందన్నారు, 50 సంవత్సరాల క్రితం ఐసిడిఎస్ ఏర్పడిందన్నారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంతో  శారీరక, మానసిక ఎదుగుదల అభివృద్ధి జరగకపోతే జీవితాంతం అంగవైకల్యంతో పిల్లలు బాధపడవలసి వస్తుందన్నారు, ప్రభుత్వాలు తీసుకుంటూన నిర్ణయంతో భావితరాల అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నయన్నారు, ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్లకు బోధించే బాధ్యత ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశాడు లేని పక్షంలో ప్రభుత్వం పైన పోరాటం నిర్వహిస్తామని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు

WhatsApp Image 2025-09-26 at 12.03.36 PM

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

క్లింకార న్యూస్: సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తుల క్లింకార న్యూస్: సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తుల
క్లింకార న్యూస్:సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తులఉమ్మడి మెదక్ జిల్లాలో 251 మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరి కిషన్ నోటిఫికేషన్ విడుదల...
వట్ పల్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కుల పంపి
ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను అరెస్టు చేస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను  అమలు చేయకపోతే....  పోరాటాలను ఉదృతం చేస్తాం? 
జిల్లా పోలీసు కార్యాలయం,           సంగారెడ్డి జిల్లా.  పత్రిక ప్రకటన, తేది: 26.09.2025
దమ్మపేటలో పారిశుద్ధ్యం లోపించినది క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 25 గ్రామములోనీ బజారులు చెత్తాచెదారంలో దర్శనమీస్తున్నవి
గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన నెట్‌వర్క్ అవసరం – టీఎసీ సభ్యుడు పల్లెల రామలక్ష్మయ్య డిమాండ్
క్లింకార న్యూస్: ఏ పార్టీతోనూ కలిసే ప్రసక్తే లేదు: కిషన్ రెడ్డి