జిల్లా పోలీసు కార్యాలయం, సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన తేది: 24-09-2025
జిల్లా పోలీసు కార్యాలయం,
సంగారెడ్డి జిల్లా.
పత్రిక ప్రకటన తేది: 24-09-2025
• వార్షిక తనిఖీలలో భాగంగా నారాయణఖేడ్ పోలీసు స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ..
• స్టేషన్ పరిసరాల శుభ్రత, రికార్డ్స్ మెంటేనేన్స్, క్రైమ్ వెహికల్స్, సిబ్బంది కిట్ ఆర్టికల్స్ తనిఖీ
: జిల్లా ఎస్పి శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు.
వార్షిక తనిఖీలలో భాగంగా ఈ రోజు తేది: 24-09-2025 నాడు నారాయణఖేడ్ పోలీసు స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పి శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు, నారాయణఖేడ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, డిఎస్పీ గారితో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు.. అనంతరం స్టేషన్ పరిసరాల శుభ్రత, సిబ్బంది కిట్ ఆర్టికల్స్, సీజ్ చేసిన క్రైమ్ వెహికిల్స్ ను తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డ్ లను తనిఖీ చేస్తూ, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల చేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేస్తూ భాదితులకు అండగా నిలవాలని అన్నారు. ఇన్వెస్టిగేషన్ లో సందేహాలుంటే.. ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని ఎస్.హెచ్.ఓ కు సూచనలు చేశారు. నేరాలు జరిగిన ప్రాంతాలను స్టేషన్ పార్ట్-II మ్యాప్ లో నమోదు చేయాలని, ఆస్థి సంబంధిత నేరాలు జరుగుతున్న ప్రాంతాలను “క్రైమ్ హాట్ స్పాట్స్” గా గుర్తించి, నిఘా కట్టుదిట్టం చేయాలని అన్నారు. స్టేషన్ పరిదిలో గల కేడి, సస్పెక్ట్, రౌడీ షీటర్ లను చెక్ చేస్తూ వారి కదలికలపై నిఘా ఉంచాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి, వాహనాల వేగం అదుపునకు ర్యాంబుల్ స్ట్రిప్స్, ఇసుక డ్రమ్ములు, సూచిక బోర్డు లను ఏర్పాటు చేయాలని అన్నారు. సైబర్ నేరాల అదుపునకు విద్యాసంస్థలలో, పని ప్రదేశాలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. డైల్ -100 కాల్స్ కు బ్ల్యూ కోల్ట్స్, పెట్రో కార్ సిబ్బంది త్వరితగతిన స్పందించి, నేరాస్థలానికి చేరుకోవాలని, త్వరగా ఘటన స్థలానికి చేరుకోవడం వలన నేరం తీవ్రతను తగ్గించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. నేరాల అదుపులో, జరిగిన నేరాలను ఛేదించడంలో ఉపయోగపడే సిసి కెమెరాల ఏర్పాటు కృషి చేయాలన్నారు.
స్టేషన్ రికార్డుల మెయింటనెన్స్, సిబ్బంది పని తీరు బాగుందని, ఎస్.హెచ్.ఓ విద్యాచరణ్ రెడ్డి, సిబ్బందిని ఎస్పి గారు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ తనిఖీ లలో ఎస్పి గారి వెంబడి నారాయణఖేడ్ డియస్పి వెంకట్ రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సిసి విజయ్ పవార్ లు ఉన్నారు.
Comment List