అనారోగ్యంతో పంచాయతీ కార్మికుడు మృతి చౌటకూర్// క్లింకార న్యూస్ కృష్ణ కాంత్ ప్రతినిధి 15
అనారోగ్యంతో పంచాయతీ కార్మికుడు మృతి
చౌటకూర్// క్లింకార న్యూస్ కృష్ణ కాంత్ ప్రతినిధి 15
చౌటకూర్ మండలం సుల్తాన్ పూర్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు చంటి సుందరయ్య (56) అనారోగ్యంతో మృతి చెందారు. గత నాలుగేళ్లుగా పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురవడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. మృతుడికి భార్య అనసూయ, ఇద్దరు పిల్లలున్నారు. మృతి చెందిన పంచాయతీ కార్మికుడు సుందరయ్య భౌతికకాయానికి ఎంపీడీవో కె.శంకర్. కార్యదర్శి పావని సోమవారం నివాళులర్పిం చారు. అంత్యక్రియల నిమిత్తం రూ.ఐదు వేలు నగదు అందజేయగా, మాజీ ఉప సర్పంచ్ గుండన్నగారి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గొల్ల మహేశ్, పట్లోళ్ల చెన్నంరెడ్డి, మహేందర్ లు మరో రూ.5,500 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్మికుడు సుందరయ్య మృతి పంచాయతీకి తీరనిలోటన్నారు
Comment List