ఇష్టారీతిన త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చి తమ కడుపు కొడుతున్నారని సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలం గ్రామాల రైతులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారితో కలసి ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు గారిని కలిసి తమ ఆవేదనను చెప్పుకున్నారు. 

On
ఇష్టారీతిన త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చి తమ కడుపు కొడుతున్నారని సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలం గ్రామాల రైతులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారితో కలసి ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు గారిని కలిసి తమ ఆవేదనను చెప్పుకున్నారు. 

ఇష్టారీతిన త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చి తమ కడుపు కొడుతున్నారని సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలం గ్రామాల రైతులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారితో కలసి ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు గారిని కలిసి తమ ఆవేదనను చెప్పుకున్నారు. 
 
తమ భూములు కోల్పోకుండా, అలైన్మెంట్ లో మార్పులు చేసే విధంగా తమ పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయాలని, పాత అలైన్మెంట్ ని కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మాజీ మంత్రి హరీష్ రావు కి గోడువెల్లబోసుకున్న రైతులు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు వారికి భరోసా ఇచ్చారు.  రైతులు భూములు కోల్పోకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తామని హామీ ఇచ్చారు. 

సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు త్రిబుల్ ఆర్ రైతులకు అండగా నిలుస్తూ, అలైన్మెంట్ మార్చాలని రైతులకు అండగా నిలుస్తున్నారు. ..

ఈ సందర్భంగా హరీష్ రావు కామెంట్స్:

రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్ )ప్రాజెక్టు అలైన్మెంట్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిగా మారుస్తూ పేద రైతుల పొట్ట కొడుతుండటం దుర్మార్గం. 
కాంగ్రెస్ అనాలోచిత చర్యల వల్ల రైతులు పంట భూములను కోల్పోతున్న పరిస్థితి. పచ్చటి పొలాల గుండా అలైన్మెంట్ చేసి, రైతన్న నోట్లో మట్టి కొడుతున్నారు. 
రీజనల్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ తో రేవంత్ రెడ్డి ఆడుతున్న ఆటలు పేద రైతులకు శాపం లా మారాయి .

ఉత్తర భాగాన అలైన్మెంట్ మార్పు వల్ల సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలంలోని గిరిమాపూర్, తుమ్మరపల్లి, అలియాబాద్, మారేపల్లి, రాంపూర్ తాండ, గోటిలగుట్ట తండా, మాచేపల్లి తండా, శివన్న గూడెం, గంగారం గ్రామాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. 

ముఖ్యంగా ఈ గ్రామాల్లో  ఎక్కువగా ఉన్న ఎస్టీ, ఎస్సీ బీసీ రైతులే .అలైన్ మెంటు మార్పు తో పేద బడుగు బలహీనవర్గాలకు చెందిన రైతులే తీవ్రంగా నష్టపోతున్నారు.
రైతులు భూములు కోల్పోకుండా మొదటగా త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ను బిఆర్ఎస్ ప్రభుత్వం గిర్మాపూర్ చేవెళ్ల మీదుగా ప్రతిపాదించింది. 

కాని రేవంత్ రెడ్డి మాత్రం తన స్వలాభం కోసం వికారాబాద్, పరిగి, కొడంగల్ మీదుగా ట్రిపుల్  ఆర్ మార్గాన్ని అష్టవంకరలుగా తిప్పుతూ పచ్చటి పొలాలను మాయం చేసే కుట్రకు తెరలేపారు.

ఓఆర్ఆర్ నుండి త్రిబుల్ ఆర్ వరకు 40 కిలోమీటర్లు దూరం ఉండవలసి ఉండగా 23 కిలోమీటర్ల దూరంలో త్రిబుల్ ఆర్ ను ప్రభుత్వం చేపట్టింది. సొంత భూములకు మేలు కలిగేలా ముఖ్యమంత్రి అలైన్మెంట్ ను అడ్డగోలుగా మార్చడం దుర్మార్గం. 

గంగారం శివన్న గూడెం గ్రామంలోని పూర్తి భూమి కోల్పోయి గ్రామం మొత్తం నిర్వాసితులు అవుతున్నారు. ఇంతమంది రైతుల ఆవేదన రేవంత్ రెడ్డికి అర్థం అవడం లేదా. 

ఒక ఊరికి ఊరే పూర్తిగా నీ ధన దాహానికి బలైతుంటే కనీసం నీకు దయలేదా..రేవంత్ రెడ్డీ ?

ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకుల భూములు ఎక్కడ కూడా నష్టపోకుండా రైతుల పొలాలు మాత్రమే నష్టపోయేలా ప్రతిపాదించడం సిగ్గుచేటు. 

త్రిబుల్ ఆర్ ప్రాజెక్టును భవిష్యత్ అవసరాలకు అనుకూలంగా బి ఆర్ ఎస్ పార్టీ ప్రతిపాదించి రైతుల భూములు ఎక్కువగా నష్టపోకుండా అలైన్మెంట్ను చేస్తే, రేవంత్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. 

ఎన్నికల ముందు ట్రిపుల్ ఆర్ ను తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత పేద రైతులను బలి చేస్తూ కాంగ్రెస్ నాయకుల భూములను కాపాడుతున్నది. 

ఇది కేవలం సంగారెడ్డి నియోజకవర్గ సమస్య కాదు. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ విషయంలో ప్రభుత్వం నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ ఇష్టారీతిగా అలైన్మెంట్ ని మారుస్తూ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నది.  

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ పరిధిలో త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ను ఓఆర్ఆర్ నుంచి 40 కిలోమీటర్లు బదులుగా 28 కిలోమీటర్లకు కుదించడానికి నిరసిస్తూ భూ నిర్వాసితులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదు. 

మధ్య నుండి రోడ్డు వెళ్లడం వలన మున్సిపాలిటీ రెండు భాగాలుగా విడిపోతున్నది. బాధితులు రెండు పంటలు పండించే పచ్చని పొలాలను, ఇండ్లు, ప్లాట్లను కోల్పోతున్నా ప్రభుత్వం కనికరించడం లేదు
ట్రిపుల్‌ ఆర్‌ పేరిట వేలాది ఎకరాలు సేకరించే క్రమంలో పెద్దల కోసం ఆలైన్‌మెంట్‌ మార్చి పేద, మధ్యతరగతి కుటుంబాల పొట్టలుగొట్టే ప్రణాళికలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధమైంది.  

హెచ్‌ఎండీఏ అధికారిక వెబ్‌సైట్‌లో ట్రిపుల్‌ ఆర్‌ అలైన్‌మెంట్‌ వివరాలను యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్లగొండ, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల పరిధిలోని వివిధ మండలాల్లోని గ్రామాల్లో ఉన్న భూముల సర్వే నంబర్ల వివరాలతో ప్రభుత్వం ప్రచురించింది. ఇందులో ఎక్కువగా రైతుల భూములే కోల్పోతున్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం వల్ల భూములు కోల్పోతున్న రైతులు అన్ని జిల్లాల్లో ఆందోళనకు దిగుతున్నారు.
జీవనాధారమే లేకుండా పోతుందని కడుపుమండిన వేలాది మంది రైతులు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రోడ్లపై కొచ్చి నిరసనలు తెలుపుతున్నారు.

పాత ఆలైన్‌మెంట్‌ మార్పును నిరసిస్తూ హైదరాబాద్‌-శ్రీశైలం హైవేపై మాలేపల్లి, పోలేపల్లి, సింగంపల్లి, సంకటోనిపల్లి రైతులు సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగినా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు. 

నాడు ఫార్మా సిటీ వద్దు అన్నారు, నేడు మాట మార్చి పచ్చటి పొలాల్లో చిచ్చు బెడుతున్నారు. గిరిజనుల బిడ్డలను జైళ్ల పాలు చేశారు.

నాడు రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు అన్నారు నేడు మాట మార్చి, నిర్బంధాల మధ్య భూసేకరణ కొనసాగిస్తున్నారు.
రేవంత్ రెడ్డి గారూ.. మాట మార్చడమే మీ విధానమా? ప్రజలను మభ్య పెట్టడమే కాంగ్రెస్ పద్దతా.

భువనగిరి లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రియాంక గాంధీ గారితో.. ట్రిపుల్ ఆర్  లో భూములు కోల్పోయిన రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పించారు.

కానీ, అధికారంలోకి రాగానే బాధితుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. వేధిస్తూ దాడులకు దిగుతున్నారు.

ఇప్పటికైనా కళ్లు తెరిచి త్రిపుల్ ఆర్ ప్రాజెక్టుపై రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయండి. లేదంటే బాధితుల ఆగ్రహానికి గురికాక తప్పదు.

తన స్వ లాభం కోసం అలైన్ మెంటు మారుస్తున్న రేవంత్ కు రాష్ట్రం తో పాటు రైతుల ప్రయోజనాలు పట్టడం లేదు 
పదే పదే అలైన్ మెంట్ మారుస్తుండటం తో కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ ను తిరస్కరించే పరిస్థితి వచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వ సొంత డబ్బులతో ట్రిపుల్ ఆర్ చేపడితే అది ఖజానా కు పెను భారం కాదా ?

సొంత భూముల కోసం అలైన్మెంట్లు మార్చడం వల్ల వేలకోట్ల భారం రాష్ట్ర ప్రజలపై పడుతున్నది. 
అందిన కాడికి దోచుకోవడం కోసం త్రిపుల్ ఆర్ అలైన్ మెంట్ మారుస్తున్న తతంగం పై వెంటనే విచారణ జరగాలి.

ట్రిపుల్ ఆర్ నిర్మాణం తన ఇంటి వ్యవహారం కాదని రాష్ట్రం ,రైతుల ప్రయోజనాలు ఫణంగా పెట్టే చర్యలు ఆపక పోతే బీ ఆర్ ఎస్ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరిస్తున్నాం .

దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం.

అదేవిధంగా, దక్షిణ దిక్కున 40 కిలోమీటర్లు పరిగణలోకి తీసుకున్నట్లుగానే, ఉత్తర భాగాన పరిగణలోకి తీసుకోవాలని రైతుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 

లేదంటే ప్రభుత్వాన్ని నిలదీస్తాం.సమస్య పరిష్కరించే వరకు బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది.

WhatsApp Image 2025-09-16 at 11.32.29_53341e00

Views: 1
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

క్లింకార న్యూస్: సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తుల క్లింకార న్యూస్: సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తుల
క్లింకార న్యూస్:సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తులఉమ్మడి మెదక్ జిల్లాలో 251 మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరి కిషన్ నోటిఫికేషన్ విడుదల...
వట్ పల్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కుల పంపి
ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను అరెస్టు చేస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను  అమలు చేయకపోతే....  పోరాటాలను ఉదృతం చేస్తాం? 
జిల్లా పోలీసు కార్యాలయం,           సంగారెడ్డి జిల్లా.  పత్రిక ప్రకటన, తేది: 26.09.2025
దమ్మపేటలో పారిశుద్ధ్యం లోపించినది క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 25 గ్రామములోనీ బజారులు చెత్తాచెదారంలో దర్శనమీస్తున్నవి
గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన నెట్‌వర్క్ అవసరం – టీఎసీ సభ్యుడు పల్లెల రామలక్ష్మయ్య డిమాండ్
క్లింకార న్యూస్: ఏ పార్టీతోనూ కలిసే ప్రసక్తే లేదు: కిషన్ రెడ్డి