పట్టణ సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాలు సమస్యలతో కొట్టుమిట్టు లాడుతున్న సంగారెడ్డి పట్టణ ప్రజలు వర్షం పడితే ఇంటికి వెళ్లాలంటే భయమేస్తుంది
పట్టణ సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాలు సమస్యలతో కొట్టుమిట్టు లాడుతున్న సంగారెడ్డి పట్టణ ప్రజలు
వర్షం పడితే ఇంటికి వెళ్లాలంటే భయమేస్తుంది
రోడ్లు వీధిలైట్లు మురికి కాలువలు సరిగా లేక ఇబ్బంది పడుతున్న 11వ వార్డు పట్టణ ప్రజలు
త్రాగడానికి కూడా మంచినీళ్లు రావడం లేదు ఏమీ తాగాలి మేము అంటున్న ప్రజలు పట్టించుకోని మున్సిపల్ అధికారులు
సిపిఎం పార్టీ సంగారెడ్డి ఏరియా కార్యదర్శి ఎం, యాదగిరి డిమాండ్
సిపిఎం పార్టీ సంగారెడ్డి ఏరియా కమిటీ ఆధ్వర్యంలో పర్యటన
పట్టణ సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాలు సమస్యలతో కొట్టుమిట్టు లాడుతున్న సంగారెడ్డి పట్టణ ప్రజలు వర్షం పడితే ఇంటికి వెళ్లాలంటే భయమేస్తుంది రోడ్లు వీధిలైట్లు మురికి కాలువలు సరిగా లేక ఇబ్బంది పడుతున్న 11వ వార్డు పట్టణ ప్రజలు త్రాగడానికి కూడా మంచినీళ్లు రావడం లేదు ఏమీ తాగాలి మేము అంటున్న ప్రజలు పట్టించుకోని మున్సిపల్ అధికారులని సిపిఎం పార్టీ సంగారెడ్డి ఏరియా కార్యదర్శి ఎం, యాదగిరి అన్నారు ఈ రోజు సిపిఎం పార్టీ సంగారెడ్డి ఏరియా కమిటీ ఆధ్వర్యంలో 11 వార్డులో పర్యటించడం జరిగింది
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సంగారెడ్డి ఏరియా కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన సంగారెడ్డి సంగారెడ్డి పట్టణంలో 11వ వార్డులో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు చెప్పినా ఈ వార్డు సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వివరించారని ఆయన అన్నారు వర్షాలు పడితే ఇంటికి వెళ్లాలంటే భయమేస్తుందని అన్నారు రాత్రిపూట కూడా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయని అన్నారు ఇక్కడ అనేక సమస్యలు ఉన్న పట్టించుకోవడంలేదని అన్నారు గత ప్రభుత్వానికి అనేక సార్లు చెప్పిన ఇక్కడ వచ్చినారు తప్ప మా సమస్య పరిష్కారం కాలేదని ఆయన అన్నారు ఇప్పుడొచ్చిన ప్రభుత్వమైన 11వ వార్డ్ ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు రోడ్లు, వీధిలైట్లు మురికి కాలువలు, తీయడం లేదని అన్నారు వర్షం వలన పిచ్చి మొక్కలు విపరీతంగా లేచి ఇండ్లలోకి దోమలు రావడంతోటి మలేరియా, డెంగ్యూ వ్యాధులకు గురవుతున్నారని ఆయన అన్నారు ఇన్ని సమస్యలున్నా అధికారులు గాని ప్రభుత్వం గని మాత్రం పట్టించుకోకపోవడం చాలా దారుణం అని అన్నారు సంగారెడ్డి పట్టణంలో తాగడానికి మంజీర నీళ్లు రాకపోవడం ఏంటని అన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి 11 వార్డులు నివాసముంటున్న పేద ప్రజలకు మంచినీరు తాగడానికి ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు, పేరు గొప్ప ఊరు దిబ్బలా ప్రభుత్వం తయారైన తప్ప ప్రజలకు అనుకూలంగా పనిచేయడం లేదని అన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రజలు కావాల్సిన సమస్యలు పరిష్కరించాలని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు వీధి వీధిలైట్లు, సరిగా రాక ఇండ్లలోకి పాములు వస్తున్నాయని ఆయన అన్నారు వీధిలైట్లు సరిగా లేవు రాత్రి అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు సమస్యలన్నీ పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పోరాటం నిర్వహిస్తామని ఆయన ప్రభుత్వానికి హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శంకర్, రాకేష్ రాములు, రాజ్ కుమార్ బాలరాజు, దుర్గయ్య , ఎలీషా, మల్లేశం, రాజు తదితరులు పాల్గొన్నారు
Comment List