అధికారం ఎవరికి శాశ్వతం కాదు... అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం --- ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు కలెక్టర్ ప్రావీణ్య గారు అలా మాట్లాడడం బాధ కలిగించింది --- ఎమ్మెల్యే మాణిక్ రావు
అధికారం ఎవరికి శాశ్వతం కాదు... అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం --- ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు
కలెక్టర్ ప్రావీణ్య గారు అలా మాట్లాడడం బాధ కలిగించింది --- ఎమ్మెల్యే మాణిక్ రావు
అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు... వారికి మంచిది కాదు ... ప్రభుత్వాలు మారుతుంటాయి... --- ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు
కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తే మళ్లీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్న వదిలేది లేదు...--- ఎమ్మెల్యే మాణిక్ రావు గారు
సంగారెడ్డి నియోజకవర్గ సమస్యలపై అదనపు కలెక్టర్ ను కలసిన ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ గారు, మాణిక్ రావు గారు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ గారు ...
చింత ప్రభాకర్ గారి మాటాడుతూ...
ప్రజలకు అత్యవసరమైన సమస్యలు గుర్తించి గత ప్రభుత్వంలో నిధులు మంజూరు చేశాం... అభివృద్ధి అడ్డుకునేలా గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు రద్దు చేశారు...
గత ప్రభుత్వంలో మంజూరు అయినా పనులు ప్రారంభించి , నియోజకవర్గానికి ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చినా స్వాగతిస్తాం సహకరిస్తాం ...
సంగారెడ్డి, సదాశివపేట SDF నిధులు , సంగారెడ్డి, సదాశివపేట మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ,TUFIDC ,MRR గ్రాంట్, ధోభీ ఘాట్, మినీ హజ్ హౌస్ రూ.2 కోట్ల నిధులు, ఎంపీపీ బిల్డింగ్ పెండింగ్ రూ.85 లక్షలు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు కోరారు...
బేగంపేటలో ఫిషరీస్ బిల్డింగ్ కోసం స్థలం కేటాయించాలని కోరారు... సంగారెడ్డి సదాశివపేట మున్సిపల్ లో పెండింగ్ లో ఉన్న వెజ్ నాన్ వెజ్ బిల్డింగ్ ను పూర్తి చేయాలని కోరారు...
సంగారెడ్డి బైపాస్ రోడ్డు పనుల్లో నాణ్యత లోపించింది... నాణ్యతగా రోడ్డు మరమ్మతులు చేపట్టాలి...
పలుమార్లు నియోజకవర్గ సమస్యలపై వినతులు ఇచ్చిన ఉపయోగంగా లేదు... అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు...
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు లో కాంగ్రెస్ నేతలు ఏకపక్షంగా మంజూరు చేసుకోవడానికి అధికారులు ఏకపక్షంగా సహకరిస్తున్నారు... BRS ఎమ్మెల్యే లు ఉన్న చోట ఉద్దేశ పూర్వకంగా ఆలస్యం చేస్తున్నారు ...
కలెక్టర్ పై ఎమ్మెల్యే మాణిక్ రావు... అసంత్రుప్తి...
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గారి తీరుపై జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు తీవ్ర అసంతృప్తి ...
ప్రజలు ఎన్నుకున్న శాసన సభ్యునికి అవమానపరిచే విధంగా కలెక్టర్ గారు మాట్లాడడం బాధాకరం అని వాపోయారు...
ఎమ్మెల్యేకు పూర్తిగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అర్హత ఉంటుంది.. ప్రతిపక్షంలో ఉన్నామని జిల్లా ఇంచార్జి మంత్రి 40 శాతం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశాలు ఇస్తే కలెక్టర్ ప్రావీణ్య పట్టింపు లేని సమాధానాలు చెప్తున్నారని అన్నారు...
ఎక్కడైనా 40 శాతం ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని GO ఉందా అని కలెక్టర్ ప్రావీణ్య ఎదురు ప్రశ్నించడంతో బాధ కలిగించిందిని ఆవేదన వ్యక్తం చేశారు...
జిల్లా ఇంచార్జి మంత్రి గారు చెప్పినా కానీ కలెక్టర్ లెక్క చేయకపోవడం ఏంటని అన్నారు...
నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు లో ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది...
ఇందిరమ్మ కమిటీలు వేసి... ఇందిరమ్మ ఇళ్లు మొత్తం కాంగ్రెస్ నాయకులకె ఇస్తున్నారు... వారికి అధికారులు మద్దతు ఇస్తున్నారు ...
అధికారులు తీరు మార్చుకోవాలని సూచించారు ...
కార్యక్రమంలో జైపాల్ రెడ్డి, బుచ్చిరెడ్డి, సాయి కుమార్, కొండల్ రెడ్డి, ప్రభాకర్, శ్రీధర్ రెడ్డి, విష్ణు తదితరులు ఉన్నారు ....
Comment List