జిల్లా పోర్యాలయం,             సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన - తేది: 17.09.2025,

On
జిల్లా పోర్యాలయం,              సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన - తేది: 17.09.2025,

జిల్లా పోర్యాలయం,  

          సంగారెడ్డి జిల్లా.
పత్రిక ప్రకటన - తేది: 17.09.2025,

•    పటాన్ చెర్వు పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసినలీస్ కా జిల్లా ఎస్పీ..

•    డ్యూటి చాట్, స్టేషన్ రికార్డు ల పరిశీలన..
•    డైల్ - 100 కాల్స్ కు త్వరితగతిన స్పందించాలి.. 
•    ట్రాఫిక్ సమస్యను అదిగమించడానికి, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చేపట్టాలి..   
•    అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి.. 
•    ఆన్లైన్ బెట్టింగ్స్, బెట్టింగ్ ఆప్స్ మరియు సైబర్ క్రైమ్స్ గురించి, ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. : జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు.
  
ఈ రోజు తేది: 17.09.2025 నాడు పటాన్ చెర్వు పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. గారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డ్ లైన ఆర్డర్ బుక్, డ్యూటి రోస్టర్, పార్ట్-ii మ్యాప్ లను తనిఖీ చేశారు. అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. లాంగ్ పెండింగ్ కేసుల చేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన, ఇన్వెస్టిగేషన్ చేయాలని అన్నారు.
 
ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఉద్యోగుల తాకిడి, స్కూల్స్, కళాశాల బస్సుల వలన అధిక ట్రాఫిక్ సమస్య ఎదురవుతుందని, దీనిని అధిగమించడానికి ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని, అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, యస్.హెచ్.ఒ కు పలు సూచనలు చేశారు.   

సులభ మార్గంలో డబ్బులు సంపాధించాలనే అత్యాశతో యువత ఆన్లైన్ బెట్టింగ్స్ ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ.. సైబర్ మోసగాళ్ళ చేతిలో చిక్కి డబ్బులు కోల్పోతూ.. అప్పులు చేసి, చేసిన అప్పులను తీర్చలేక తనువును చాలిస్తున్నారని అన్నారు. గేమింగ్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. 

అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. అధికారులు సిబ్బంది 24*7 హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని, దూర ప్రాంతాల నుండి ప్రయాణాలకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు.

WhatsApp Image 2025-09-18 at 15.16.27_405797e5

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

క్లింకార న్యూస్: సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తుల క్లింకార న్యూస్: సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తుల
క్లింకార న్యూస్:సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తులఉమ్మడి మెదక్ జిల్లాలో 251 మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరి కిషన్ నోటిఫికేషన్ విడుదల...
వట్ పల్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కుల పంపి
ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను అరెస్టు చేస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను  అమలు చేయకపోతే....  పోరాటాలను ఉదృతం చేస్తాం? 
జిల్లా పోలీసు కార్యాలయం,           సంగారెడ్డి జిల్లా.  పత్రిక ప్రకటన, తేది: 26.09.2025
దమ్మపేటలో పారిశుద్ధ్యం లోపించినది క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 25 గ్రామములోనీ బజారులు చెత్తాచెదారంలో దర్శనమీస్తున్నవి
గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన నెట్‌వర్క్ అవసరం – టీఎసీ సభ్యుడు పల్లెల రామలక్ష్మయ్య డిమాండ్
క్లింకార న్యూస్: ఏ పార్టీతోనూ కలిసే ప్రసక్తే లేదు: కిషన్ రెడ్డి