17/9/2025 పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్
17/9/2025
పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్
బూర్గంపాడు మండలంలో గిరిజన ఆశ్రమ వసతి గృహాలు పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లకు పది నెలలు నుండి వేతనాలు రావటం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు,
సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో సమ్మె చేస్తున్న కార్మికుల్ని సందర్శించారు వారి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సిపిఎం పార్టీ అండగా ఉంటుందని మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు తెలిపారు,
సమ్మె చేస్తున్న కార్మికుల పొట్ట కొట్టటం దారుణమని వారి కుటుంబాలు గడవక పోవడం అప్పులు చేసి తినటం అప్పులు తీర్చలేక ఆత్మకు దారి తీసే విధంగా ఉందని, హాస్టల్లో విద్యార్థులకు ఎటువంటి లోటు లేకుండా చక్కటి వంటలు చేసి పెడుతున్న ఆ తల్లులకు
ఆ కార్మికులకి వేతనాలు వారికి ఇవ్వటానికి చేతులు రావటం లేదని ప్రభుత్వానికి మనసు రావటం లేదు పర్మెంటు చేయాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు అని ఆవేదన వ్యక్తం చేశారు,
ఇవాళ మంత్రులకు ఎమ్మెల్యేలకి లక్షల లక్షలు జీతాలు తీసుకుంటున్నారు కానీ రోజువారీగా ఎట్టి చాకిరి చేసే కార్మికులకు వేతనాలు పెంచడానికి వారికి చేతులు రావటం లేదు వెంటనే వారి సమస్యని పరిష్కారం చేయాలని అట్లా చేయని యెడల సిపిఎం పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా చెప్పారు కోట్ల రూపాయలని వృధా చేస్తున్న సంగతి అందరికీ తెలుసు కానీ అనవసరమైన ఖర్చులకి భారీ ఎత్తున పెడతారు కానీ ఈ రోజున పనిచేస్తున్న కార్మికులకి వేతనాలు కార్మికులకి పెంచలేని ప్రభుత్వాలు అందుకోసం వారి యొక్క సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు అండగా ఉంటామని తెలిపారు
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు రాయల వెంకటేశ్వర్లు శాఖ కార్యదర్శి కత్రి ప్రతాప్ సమ్మె కార్మికులు పాల్గొన్నారు
Comment List