ఘనంగా నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు చౌటకూర్ //క్లింకార న్యూస్
ఘనంగా నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు
చౌటకూర్ //క్లింకార న్యూస్
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని తాడ్ దాన్ పల్లి లో గ్రామ బిజెపి పార్టీ ఆధ్వర్యం లో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చౌటకూర్ మండల బిజెపి పార్టీ ఉపాధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లలో మూడు లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని రేషన్ పంపిణీలో కూడా ఐదు కిలోలు కేంద్రం ఇస్తుందని అన్నారు మోడీ 80 కోట్ల మంది ఆకలి తీర్చి 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకువచ్చారు అన్నారు సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవం మోడీ జన్మదిన కావడంతో డబుల్ ధమాకా అని అన్నారు అనంతరం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ స్వీట్ పంచారు కార్యక్రమంలో బీజేపీ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పల్లె శివ అంజయ్య పెంటయ్య ఆంజనేయులు కళావతి రవీందర్ మీనా సుభాష్ తదితరులు పాల్గొన్నారు
Comment List