నియోజకవర్గంలో ఉన్న ఆదివాసీ గిరిజన కొండరెడ్ల గొత్తికోయ గ్రామాలకు అన్ని వసతులు కల్పిస్తున్నాం ---- ఎమ్మెల్యే జారె 12.09.2025 - శుక్రవారం
నియోజకవర్గంలో ఉన్న ఆదివాసీ గిరిజన కొండరెడ్ల గొత్తికోయ గ్రామాలకు అన్ని వసతులు కల్పిస్తున్నాం ---- ఎమ్మెల్యే జారె
12.09.2025 - శుక్రవారం
దమ్మపేట మండలంలోని మారుమూల ఆదివాసీ గిరిజన గొత్తికోయ కొండరెడ్ల గ్రామాలైన కట్కూరు పూసుకుంట గ్రామాలను గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు సందర్శించారు ఈ సందర్భంగా ₹3 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించి గ్రామస్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు అలాగే నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధునికి తన సొంత ఖర్చులతో ట్రై సైకిల్ అందజేయడం ద్వారా మానవత్వాన్ని చాటుకున్నారు గ్రామస్తులతో మాట్లాడుతూ గిరిజన ఆదివాసీ గ్రామాల అభివృద్ధి కోసం ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు పంపామని త్వరలోనే అన్ని వసతులు కల్పించి అభివృద్ధి సంక్షేమం అందిస్తామన్నారు అలాగే అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు
పట్టాలు పొందిన పోడు భూములలో వ్యవసాయం చేస్తూ ఆర్థికంగా బలోపేతం అవ్వాలని సూచించారు పామ్ ఆయిల్ సాగు ప్రోత్సహిస్తూ గతంలోనే కొందరికి బోరు మోటర్లు ఆయిల్ ఫామ్ మొక్కలు మంజూరు చేసామని మిగిలిన వారికి కూడా వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలియజేశారు..
Comment List