జిల్లా పోలీసు కార్యాలయం,             సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన తేది: 14-09-2025,

On
జిల్లా పోలీసు కార్యాలయం,             సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన తేది: 14-09-2025,

జిల్లా పోలీసు కార్యాలయం, 
           సంగారెడ్డి జిల్లా.
పత్రిక ప్రకటన తేది: 14-09-2025,

•    జాతీయ మెగా లోక్-అదాలత్ లో 1698  కేసులలో రాజీ..
•    సైబర్ క్రైమ్స్ 266 కేసులలో 1.05 కోట్ల రూపాయలను తిరిగి సైబర్ బాధితులకు అందేలా ఉత్తర్వులు..
•    జాతీయ మెగా లోక్-అదాలత్ ను విజయవంతం చేసిన అధికారులను, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ. పరితోష్ పంకజ్ ఐపిఎస్. గారు.  

ఈ సందర్భంగా ఎస్పీ గారు ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. గత నెల రోజుల నుండి నిన్న తేది: 13.09.2025 వరకు జరిగిన జాతీయ మెగా లోక్-అదాలత్ లో భాగంగా, జిల్లా అధికారులు సిబ్బంది పూర్తి నిబద్దతలో విధులు నిర్వహించి, జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన, రాజీ పడటానికి అవకాశం ఉన్నటువంటి మరియు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న 540- ఐ.పి.సి., 318 - ఇ-పెట్టి, 840 - డిడి కేసులు మొత్తం = 1698 కేసులలో కక్షిదారులను రాజీ కుదిర్చడం జరిగింది అన్నారు. సైబర్ క్రైమ్ - 266 కేసులలో 1.5 కోట్ల రూపాయాలను తిరిగి సైబర్ క్రైమ్ బాధితులకు అందించే విధంగా ఉత్తర్వులను ఇప్పించడం జరిగింది అన్నారు. 

క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక సువర్ణావకాశం అని,  అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని అన్నారు. రాజీ మార్గమే రాజా మార్గం అని, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులల్లో ఇరు వర్గాలు రాజీపడవచ్చు అన్నారు.

ముఖ్యంగా సైబర్ నేరాలలో బాధితులకు సత్వర న్యాయం చేయడానికి, TGCSB [తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో]  డైరెక్టర్ శ్రీమతి. శిఖాగోయల్ ఐపిఎస్. గారి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన D4C సత్:ఫలితాలను ఇస్తుందని ఎస్పీ గారు అన్నారు.  ప్రజలెవరైనా సైబర్ మోసాలకు గురి అయినట్లయితే వెంటనే 1930 కి కాల్ చేసి గాని, NCRP పోర్టల్ ద్వారా గాని దరఖాస్తు చేయాలని సూచించడం జరిగింది. 

ఈ సందర్భంగా జాతీయ మెగా లోక్-అదాలత్ ను విజయవంతం చేసిన అధికారులు సబ్-డివిజినల్ అధికారులకు, D4C- డిఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, ఇన్స్పెక్టర్ రవి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, కోర్టు లైజనింగ్ అధికారి సత్యనారాయణ ఎస్ఐ, కోర్ట్ డ్యూటీ, సైబర్ సెల్ సిబ్బందిని ఎస్పీ గారు అభినందించారు.

WhatsApp Image 2025-09-14 at 21.16.34_50f34390

Views: 3
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

క్లింకార న్యూస్: సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తుల క్లింకార న్యూస్: సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తుల
క్లింకార న్యూస్:సంగారెడ్డి: రేపటి నుంచి మద్యం దుకాణాల దరఖాస్తులఉమ్మడి మెదక్ జిల్లాలో 251 మద్యం దుకాణాల కేటాయింపునకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరి కిషన్ నోటిఫికేషన్ విడుదల...
వట్ పల్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కుల పంపి
ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను అరెస్టు చేస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను  అమలు చేయకపోతే....  పోరాటాలను ఉదృతం చేస్తాం? 
జిల్లా పోలీసు కార్యాలయం,           సంగారెడ్డి జిల్లా.  పత్రిక ప్రకటన, తేది: 26.09.2025
దమ్మపేటలో పారిశుద్ధ్యం లోపించినది క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 25 గ్రామములోనీ బజారులు చెత్తాచెదారంలో దర్శనమీస్తున్నవి
గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన నెట్‌వర్క్ అవసరం – టీఎసీ సభ్యుడు పల్లెల రామలక్ష్మయ్య డిమాండ్
క్లింకార న్యూస్: ఏ పార్టీతోనూ కలిసే ప్రసక్తే లేదు: కిషన్ రెడ్డి