కంగ్టి క్లింకారా న్యూస్ సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని ముకుంద నాయక్ తండా గ్రామపంచాయితీలో
కంగ్టి క్లింకారా న్యూస్ సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల
పరిధిలోని ముకుంద నాయక్ తండా గ్రామపంచాయితీలో వచ్చునాయక్ తండా రోడ్డు చినుకుపాటి వర్షానికి స్విమ్మింగ్ పూల్ తలపిస్తుంది.
మొన్న జరిగిన మున్యా నాయక్ తండకు రోడ్డు సౌకర్యం లేక ఒక గర్భిణీ స్త్రీ మార్గమధ్యంలోనే కాన్పు కావడం మనందరికీ తెలిసిందే..
కంగ్టి మండల పరిధిలోని ముకుంద నాయక్ తాండ మాజీ సర్పంచ్ సురేఖ వెంకట్ రాథోడ్ స్థానిక ఎమ్మార్వో, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
ఈరోజు తహసీల్దార్ భాస్కర్ గారు వారితో పాటు గిర్ధవర్ తాజోధిన్ గారు పూర్తిగా నాశనం అయినా వాచ్ నాయక్ తాండ రోడ్డును పరిశీలించారు.
వాచ్ నాయక్ తండ వాసులు తెలిపిన వివరాల ప్రకారం గత ప్రభుత్వ హయాంలో రోడ్డు వేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు రోడ్డు వేయలేదని అన్నారు.
కంగ్టి మండల కేంద్రానికి ఏదైనా సమస్య మీద హాస్పిటల్ కి గాని మండల ఆఫీసుకు గానీ మార్కెట్ కి పోవాలన్న గుంతల మయమైన రోడ్డు పై నుండి ప్రయాణం చేయాల్సి వస్తుంది.
వర్ష కాలం వస్తే రోడ్డు మీద నీళ్లు ఉండడంవల్ల అలాగే గుంతల ఉండడంతో రోడ్డు మీద వెళ్లడానికి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
కాబట్టి ఇప్పటికైనా వాచ్చు నాయక్ తాండకు రోడ్డు సౌకర్యం కల్పించాలని తాండవాసులు కోరుతున్నారు.
Comment List