శ్రీ వేనుగోపాల వేంకటేశ్వర ఆలయంలో దీప సేవ సత్య వ్రతము క్లింకారా న్యూస్, కుటుంబ శ్రేయస్సు కోసం ఏకాదశి ఉపవాసం ఉండాలి,
శ్రీ వేనుగోపాల వేంకటేశ్వర ఆలయంలో దీప సేవ సత్య వ్రతము
క్లింకారా న్యూస్,
కుటుంబ శ్రేయస్సు కోసం ఏకాదశి ఉపవాసం ఉండాలి, ఆలయ దర్శనం చేసుకోవాలని పురోహితులు ఆరుట్ల శ్రీధరాచార్య పిలుపు
తేదీ.05.07.2025 మంగళవారం స్థానిక ద్వారక పేట శ్రీ వేణుగోపాల వెంకటేశ్వరా స్వామి ఆలయంలో
శ్రావణ శుద్ధ ఏకాదశి
పురస్కరించుకుని ప్రాంతకాల ఉదయం వేద మంత్రాలచే పంచామృత అభిషేకం,
మహా తిరుమంజనము అఖండ వస్రాలంకరణం ఆలయ అర్చకులు ఆరుట్ల వెంకటాచార్య, శ్రీధరాచార్య, గిరి, శ్రీనివాస్, వెంకటేష్, రంగనాధ స్వామి పురోహితులు ప్రత్యేక పూజలు చేశారు, వికాస తరంగిణి నర్సంపేట శాఖ వారిచే విష్ణు
సహస్రనామార్చన జరిగింది, ఇందులో భాగంగా శ్రీ ద్వారకా వేణుగోపాల వెంకటేశ్వర
అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి భక్తులచే సమస్త జనుల క్షేమం లోక కళ్యానార్ధం మహా దీప సేవ, శ్రీ నారాయణ ఆస్థాక్షరీ మంత్రము 108 సార్లు, అనంతరం ప్రత్యేక హోమము పూర్ణహుతి కార్యక్రమము, ఓమ్ నారాయణ స్వాహాహా అని దంపతులు మహిళలు పాల్గొని శ్రీ రమా సత్యనారాయణ స్వామి వార్లకు శతనామార్చన, సత్య వ్రతము దంపతులు ఆచరించారు,శ్రీధరాచార్య మాట్లాడుతూ అందరూ కూడా ఏకాదశి ఉపవాసం వల్ల ఇంటిల్లి పాధి శుభములు చేకూరుతా య్యని చెప్పారు అనంతరం తీర్ధ ప్రసాధ వితరణ మహా ఆశీర్వాదం తొ కార్యక్రమం సుసంపన్నం ఐనది, ఇట్టి కార్యక్రమం లో ఆలయ కమిటీ పెద్దలు, దాతలు ద్వారక పేట నర్సంపేట గ్రామ భక్తులు వికాస తరంగిణి బాధ్యులు పాల్గొని కార్యక్రమం జయప్రదం చేశారు
Comment List