*ఈనెల 17న జోగిపేటలో జరిగే గ్రామపంచాయతీ జిల్లా మహాసభలు జయప్రదం చేయండి* *కంగ్టి క్లింకారా న్యూస్ గ్రామ పంచాయితీ కార్మికుల
*ఈనెల 17న జోగిపేటలో జరిగే గ్రామపంచాయతీ జిల్లా మహాసభలు జయప్రదం చేయండి*
*కంగ్టి క్లింకారా న్యూస్ గ్రామ పంచాయితీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి*
*మల్టీపర్పస్ వర్కర్స్ విధానం రద్దు చేయాలి*
*గ్రామ పంచాయితీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన మండల కమిటీ ఎన్నిక*
ఈ సందర్భంగా సిఐటియు డివిజన్ నాయకులు సతీష్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు జిపి కార్మికులకు మేము అధికారంలోకి వస్తే 18000 పెంచుతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు అలాగే మల్టీపర్పస్ విధానం తీసుకొస్తూ 51 జీవోను గత ప్రభుత్వం తీసుకొచ్చింది దాన్ని రద్దు చేయాలని అలాగే పెరుగుతున్న ధరలకు అనుకూలంగా జీతాలు పెంచాలని ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం ఉద్యోగ భద్రత మరణిస్తే మట్టి ఖర్చులు లక్ష రూపాయలు ఎక్స్గ్రేషియా 10 లక్షలు ఇవ్వాలని కార్మికుని కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం కల్పించాలని కేంద్రం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని బడా కార్పొరేటు పెట్టుబడిదారీలకు అనుకూలంగా 10 గంటల పని విధానాన్ని అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు ఒత్తిడి చేస్తూ అమలు జరపాలని చూస్తుందని పని గంటలు పెంచితే కార్మికుల ఫై పని భారం పెరిగి అనారోగ్యానికి గురయ్య పరిస్థితి నెలకొంటుంది.కార్మికుల హక్కుల కోసం కార్మికుల కుటుంబాల జీవితాలు జీతాల కోసం తదితర అంశాలపై భవిష్యత్తు కారచరణ మహాసభ లో తీర్మానం చేస్తుందని అన్నారు కావున కార్మికులు అధిక సంఖ్యలో మహాసభలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన మండల అధ్యక్ష కార్యదర్శులు నాగమ్మ, సిద్ధిరాం, ఉపాధ్యక్షులు శంకర్, సహాయ కార్యదర్శి ఏసప్ప కమిటీ సభ్యులు రాజు, మారుతి, రత్నమ్మ, లక్ష్మి, మారుతి, నరసమ్మ, తులసమ్మ, గంగారం తదితరులు పాల్గొన్నారు...
Comment List