*హత్నూర ఐటిఐ కళాశాల హాస్టల్ సొంత భవనం నిర్మించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల మహేష్ డిమాండ్ చేశారు*..
*హత్నూర ఐటిఐ కళాశాల హాస్టల్ సొంత భవనం నిర్మించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల మహేష్ డిమాండ్ చేశారు*....
*హత్నురా ఐటిఐ ఫిట్టర్ ట్రేడ్ విద్యార్థులకు ఉపాధ్యాయులను కల్పించాలి*...
ఈ సందర్భంగా *ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల మహేష్ మాట్లాడుతూ* హత్నూర ఐటిఐ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సర్వే చేయడం జరిగింది. ఐటిఐ హ త్నూర కళాశాలలో విద్యార్థులకు కరెంటు కోతలతో విద్యార్థుల తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అలాగే గత సంవత్సరం నుండి కూడా కరెంటు సప్లై క్లాస్ రూమ్ లలో లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది. విద్యార్థులకు కనీసం వాష్రూమ్స్ కూడా లేని పరిస్థితి ఉంది. తెలంగాణ ఆర్టీసీ బస్సులు కూడా విద్యార్థులకు ఆపే పరిస్థితిలో లేదు. తరగతి గదులలో టీ ఫ్లైట్స్ ఫ్యాన్స్ లేనందున విద్యార్థులు సరిగ్గా కళాశాలకు రాలేకపోతున్నారని అంటున్నారు. విద్యార్థులు సుమారు 70 కిలోమీటర్ల నుండి అప్ అండ్ డౌన్ చేయడం ద్వారా క్లాసులకు దూరమవుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి కళాశాల హాస్టల్ ను తక్షణమే కొనసాగింపులు చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఉన్న కలెక్టర్ మేడంగారు హాస్టల్ ఓపెనింగ్ చేస్తామని హామీ ఇచ్చారు ఇప్పటి వరదాకా ఓపెనింగ్ చేయలేరు. ఇప్పటికైనా జిల్లా అధికారులు కళాశాల ను విజిట్ చేసి విద్యార్థులను అడిగి తెలుసుకుని తక్షణమే హాస్టలను ప్రారంభించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు గొల్ల శంకర్. ఎస్ఎఫ్ఐ మండల్ నాయకులు, సిద్దు, అఖిల్, రాజు, ప్రసాద్, శశాంత్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
Comment List