*నామమాత్రానికె అధికార పరిపాలన* *పబ్లిసిటీకి జోరు ఎక్కువ పని తక్కువ*
*నామమాత్రానికె అధికార పరిపాలన*
*పబ్లిసిటీకి జోరు ఎక్కువ పని తక్కువ*
*డబుల్ బెడ్ రూంవద్ద డ్రైనేజ్ సమస్య*
*పట్టించుకోని మున్సిపల్ అధికారులు*
క్లింకార న్యూస్ తూప్రాన్ డివిజన్ ఆగస్టు 6
డబుల్ బెడ్ రూంవద్ద డ్రైనేజ్ సమస్య తీవ్రతంగా ఉందని డబుల్ బెడ్ రూమ్ వాసులు ఆరోపించారు. ఎన్ని సార్లు పిర్యాదు చేసినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని మీడియా ముందు వాపోయారు. 3839 40 బ్లాక్ దగ్గర డ్రైనేజ్ జామ్ అవ్వడం జరిగిందనీ తెలిపారు. సుమారు నాలుగు నెలల క్రితం నుంచి జామ్ అయిపోయి మురికి నీరు బయటకు రావడం జరుగుతుందన్నారు. రోడ్డు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. రోడ్డు సమస్యలు, డబుల్ బెడ్రూం సమస్యల గురించి గానీ అధికారులకు ఎప్పుడు చెప్పిన ఎవరూ పట్టించుకోలేధని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు స్పందించి, డబుల్ బెడ్ రూం ఏరియా ను దృష్టిలో పెట్టుకుని తొందరగా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Comment List