క్లింకారా న్యూస్: -నారాయణఖేడ్ నియోజకవర్గం- *ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలు& రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ నారాయణఖేడ్
క్లింకారా న్యూస్: -నారాయణఖేడ్ నియోజకవర్గం-
*ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలు& రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గారు*
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంలో భాగంగా మహిళాలకు వడ్డీ లేని రుణాలను ఇచ్చిన సందర్భంగా ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలు మరియు నిరుపేదలకు కడుపునిండా అన్నం పెట్టాలన్న లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న *గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి*
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ
💠 స్వయం సహాయక సంఘాలకు మొదటి ఏడాదిలో 21000 కోట్ల వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామని పాఠశాలలు క్యాంటీన్లు స్కూల్ యూనిఫాంలో తయారీ వంటి ప్రభుత్వ పనులు మహిళలకు అప్పగిస్తూ వారికి ఉపాధి కల్పిస్తున్నామని వారు అన్నారు
💠 మహిళా సంఘాల అభివృద్ధి ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందని ఈ రుణాలు వారి కుటుంబాలలో కొత్త జీవనోపాధికి మార్గం వేస్తాయి, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు వారి జీవితాలలో భారీ మార్పులు తీసుకువస్తాయని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ఇదే మా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని వారు అన్నారు
💠 గడిచిన బిఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి కూడా ఒక్క రేషన్ కార్డును ఇచ్చిన పాపాన పోలేదని పెళ్లయిన 10 సంవత్సరాలు గడిచిన పిల్లలు పుట్టి పెద్దగైన కూడా వారికి రేషన్ కార్డు గత ప్రభుత్వం ఇవ్వలేదని
💠 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను అందిస్తాం అన్న మాట ప్రకారము ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ఉద్దేశంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను అందిస్తున్నామని వారికి త్వరలోనే రేషన్ బియ్యాన్ని కూడా అందిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు అన్నారూ
💠నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణం లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం అని పట్టణం లో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడోద్దనే ఉద్దేశంతో బాగంగా పట్టణం చుట్టూ లింకు రోడ్డులను కలిపే రింగు రోడ్డు ను ప్రారంభిస్తున్నాం అని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో వారితోపాటు నారాయణఖేడ్ RDO అశోక్ చక్రవర్తి,మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ గారు,తదితర ఉన్నతాధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comment List