ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పాఠశాలలు,జూనియర్ కళాశాలల రాష్ట్రవ్యాప్త బంద్ క్లిం కారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జూలై
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పాఠశాలలు,జూనియర్ కళాశాలల రాష్ట్రవ్యాప్త బంద్
క్లిం కారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జూలై 23
డిమాండ్స్ :
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్,ఫీజు రియంబర్స్మెంట్ ని వెంటనే విడుదల చేయాలి
నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి
గురుకులాలకు సొంత భవనాలను నిర్మించాలి
మెస్ కాస్మోటిక్ చార్జీలను పెంచాలి
విద్యార్థులకు ఉచిత బస్ పాసులు ఇవ్వాలి
విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ అఖిలభారత విద్యార్థి సమాఖ్య ( ఏఐఎస్ఎఫ్ ) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపులో భాగంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అశ్వరావుపేటలోనీ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల బంద్ కు పిలుపునివ్వడం జరిగింది.విద్య రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ అఖిలభారత విద్యార్థి సమాఖ్య నాయకులు అశ్వరావుపేటలోని పాఠశాల లు మరియు జూనియర్ కళాశాల లను సందర్శించి రాష్ట్రవ్యాప్త బంద్ కు మద్దతు ఇవ్వాలని వారిని కోరారు.విద్యా రంగ సమస్యలను తీర్చే వరకు దశలవారీగా ఉద్యమాలు,పోరాటాలు చేస్తూ సమస్యల పరిష్కారానికై పాటు పడతామని అశ్వరావుపేట ఏఐఎస్ఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు,ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు
సిపిఐ అశ్వరావుపేట టౌన్ సెక్రటరీ నూకవరపు విజయకాంత్
Comment List