ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులుగా బరిగెల భూపేష్ , మోతే కృష్ణ లను ఏకగ్రీవంగా ఎన్నిక.
ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులుగా బరిగెల భూపేష్ , మోతే కృష్ణ లను ఏకగ్రీవంగా ఎన్నిక.
క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూలై 22
కొత్తగూడెం : ఇటీవల జూలూరుపాడు మండలంలో అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) జిల్లా మహాసభలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా,విశిష్ట అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు వాలి ఉల్లా ఖాద్రి, రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ నానబాల రామకృష్ణ పాల్గొన్నారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులుగా బరిగెల భూపేష్ మరియు మోతే కృష్ణ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఏఐవైఎఫ్ బలోపేతానికి కృషి చేస్తామన్నారు అదేవిధంగా మాకు ఈ బాధ్యతలు అప్పగించినందున సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ భాష ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వాలీ ఉల్లా ఖాద్రి, ధర్మేందర్ మరియు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్కె ఫాయుమ్ దాదా లకు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.ఈ మహాసభలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే ఖయ్యూం, జిల్లా కౌన్సిల్ సభ్యులుగా రౌతు సురేష్, ఎస్ కె జావిద్, మజ్జిగ రణధీర్, ఎస్ కె రసూల్, బానోతు శ్రీను
ఎన్నికయ్యారు.
Comment List