క్లింకారా న్యూస్:-నారాయణాఖేడ్ నియోజకవర్గం- *కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్
క్లింకారా న్యూస్:-నారాయణాఖేడ్ నియోజకవర్గం-
*కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి*
నగల్ గిద్ద మండల పరిధిలోని ఎస్గి గ్రామంలో ఈరోజు గ్రామ స్వరాజ్యం సంస్థ కుట్టు శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఈరోజు దానిని ప్రారంభించిన *గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి*
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ
కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం వలన అనేక పేద మధ్యతరగతి మహిళాలకు ఇదో గొప్ప సువర్ణ అవకాశమని ఇట్టి అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మహిళలకు సూచించారు
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లో మహిళలకు స్వయం సహాయక సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలు కూడా అందిస్తున్నామని ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని ఉచిత ఆర్టీసీ ప్రయాణం పథకం ప్రారంభం నుంచి నేటి వరకు 200 కోట్ల మహిళలు ప్రయాణించడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు విట్టల్ రావు పాటిల్ మాజీ సర్పంచ్,అంజి రెడ్డి pacs వైస్ చైర్మన్,రహీమ్,గుండె రావు పాటిల్, అనిల్ పాటిల్ మాజీ సర్పంచ్, నారాయణజాదవ్,మహిళలు పాల్గొన్నారు.
Comment List