రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక ఆదేశాలు జారీ చేసారు
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక ఆదేశాలు జారీ చేసారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. అక్కడి నుంచే సీఎంవో అధికారులతో ఫోన్లో మాట్లాడి, అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ తోపాటు ఇతర జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, విద్యుత్, పోలీసు, ఎస్ఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా వంటి విభాగాలు అప్రమత్తంగా ఉండి, సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే సమస్యలు, ట్రాఫిక్ జామ్లు, విద్యుత్ అంతరాయాలను తక్షణం పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది, డాక్టర్లు 24/7 అందుబాటులో ఉండాలని, సీజనల్ వ్యాధుల నివారణకు ఆరోగ్య శాఖ సన్నద్ధంగా ఉండాలనిసూచించారు. కాగా రాష్ట్రంలో 21% వర్షాభావం ఉన్నప్పటికీ, ఇటీవలి భారీ వర్షాలు ఊరట కలిగించాయని, ఐఎండీ (IMD) వాతావరణ సూచనల ఆధారంగా ముందస్తు హెచ్చరికలు, రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Comment List