మహిళలకు చేయూతనివ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయం    రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

On

మహిళలకు చేయూతనివ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయం
   రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూలై 22
కొత్తగూడెంలో మహిళాశక్తి సంబురాల్లో ఎం ఎల్ ఏ కూనంనేనితో కలిసి పాల్గొన్న కొత్వాల

తెలంగాణా రాష్ట్రంలోని మహిళలకు చేయూతనిచ్చి, వారిని లక్షాధికారులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంస్  మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. 

మంగళవారం కొత్తగూడెం పట్టణంలోని కొత్తగూడెం క్లబ్ లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళాశక్తి సంబురాల కార్యక్రమాల్లో కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు తో కలిసి కొత్వాల పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 2984 మహిళా సంఘాలకు, 29801 మంది సభ్యులకు, 157 స్వయంసహాయక సంఘాలకు 18.27 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ, 2100 స్వయంసహాయక సంఘాలకు 2.36 కోట్ల రూపాయల రుణాలను ఎం ఎల్ ఏ కూనంనేని పంపిణి చేశారు. తెల్ల రేషన్ కార్డులను పంపిణి చేశారు. 

ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలతో పాటు ఉచిత రవాణా సౌకర్యం, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణి చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అనీ, మహిళల ప్రభుత్వం అని కొత్వాల అన్నారు. 

ఈ కార్యక్రమాల్లో కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావుతోపాటు కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీరహన్మంతరావు, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు, పాల్వంచ మాజీ జడ్పీటీసీ యర్రంశెట్టి ముత్తయ్య, పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, పలువురు అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.

IMG-20250722-WA0061

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

*ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకత్వ భాగీదారీ న్యాయ మహాసమ్మేళనం* *ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకత్వ భాగీదారీ న్యాయ మహాసమ్మేళనం*
*ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నాయకత్వ భాగీదారీ న్యాయ మహాసమ్మేళనం* ఈ రోజు (జులై 25, 2025) ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ...
మధిర నియోజకవర్గం నూతన కమిటీ ఎన్నిక  క్లింకారా, న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జూలై 26
ఖాదిరాబాద్ గ్రామంలో ఇంతకు ముందు 5 (ఐదు) అంగన్ వాడి సెంటర్ లు ఉండే పిల్లలు లేక 1 (ఒక) అనగా (2వ) అంగన్ వాడి సెంటర్ ను తీసివేయడం జరిగింది.
క్లింకారా న్యూస్:- నారాయణఖేడ్ నియోజకవర్గం-మనూర్ మండల్
*నారాయణఖేడ్ లో బిఆర్ఎస్వీ- బనకచర్ల జంగ్ సైరెన్ కార్యక్రమం:*
క్లింకారా న్యూస్:-నారాయణాఖేడ్ నియోజకవర్గం- *కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్
BRS పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు శ్రీ KTR గారి జన్మదినం సందర్భంగా జోగిపేట లో ఘనంగా జన్మదిన వేడుకలు