*తహసీల్దార్ జ్ఞాన జ్యోతి కి మెమొరాండం పత్రం యూఎస్పిసి*
*తహసీల్దార్ జ్ఞాన జ్యోతి కి మెమొరాండం పత్రం యూఎస్పిసి*
క్లింకరా న్యూస్: మాసాయిపేట తూప్రాన్ డివిజన్: జులై 24
మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండలంలో ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాసాయిపేట మండల టి పి టి ఎఫ్ అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా డిమాండ్ చేశారు ఈ సందర్బంగా, మాసాయిపేట మండల తహసీల్దార్ కు మెమోరండం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం దశల వారి ఉద్యమం,చేపడుతున్నట్లు చెప్పారు. అందులో భాగంగా నేడు తాసిల్దార్ కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి సిపిఎస్ ను రద్దుచేసి ఓ పి ఎస్ ను పునరుద్దించాలి. Go Ms no 25 ను సవరించాలి 5571 పీ ఎస్ హెచ్ ఎం పోస్టులను మంజూరు చెయ్యాలి. పి ఆర్ సి నీ వెంటనే అమలు చెయ్యాలి. బదిలీలు పదోన్నతులు చేపట్టాలి.ఈ కార్య క్రమంలో టి పి టి ఎఫ్, మాజీ అధ్యక్షులు మధుసూదన్ జిల్లా నాయకులు నరేందర్ రావు, ధర్మపురి, రాజేశ్వరరావు , అక్బర్ పాషా ,మండల కార్యదర్శి రాజమణి ,వాణి ,హిమజ కళ్యాణి ,ప్రియాంక పాల్గొన్నారు.
Comment List