*సమాచారం ఇవ్వని అధికారులపై రాష్ట్ర సమాచార కమిషన్ లో ఫిర్యాదు: సంగారెడ్డి సామాజిక కార్యకర్త. శ్రీధర్ మహేంద్ర*
*సమాచారం ఇవ్వని అధికారులపై రాష్ట్ర సమాచార కమిషన్ లో ఫిర్యాదు: సంగారెడ్డి సామాజిక కార్యకర్త. శ్రీధర్ మహేంద్ర*
క్లింకార న్యూస్ సంగారెడ్డి:
సంగారెడ్డి పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తేది 7/12/2024 న సంగారెడ్డి పట్టణంలోని సర్వే నెంబర్ 374 లోని ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా క్రమబద్ధికరణ చేసుకొని అక్రమ నిర్మాణం చేస్తున్నా వారిపై ఇచ్చిన ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ కార్యాలయం, సంగారెడ్డి ఆర్ డి ఓ మరియు తహసీల్దార్ సంగారెడ్డి గార్ల ద్వారా విచారణ నివేదిక కోరిన దాదాపు ఏడు నెలలు గడిచిన సంగారెడ్డి ఆర్ డి ఓ,సంగారెడ్డి తహసీల్దార్ లు విచారణ నివేదికలు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఇవ్వలేదని కలెక్టర్ కార్యాలయం ఈ సెక్షన్ అధికారులు సంగారెడ్డి ఆర్ డి ఓ తహసీల్దార్ సంగారెడ్డిల నుండి నివేదికలు కోరడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని అట్టి నివేదిక ల పై సమాచారం కోరుతూ తేది 4-6-2025 నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమాచారం కోరగా ఇప్పటి వరకు భూఅక్రమ క్రమ బద్దికరణ మీద విచారణ నివేదికలు ఇవ్వలేదని సంగారెడ్డి తహసీల్దార్ కార్యాలయ సమాచార అధికారి తో పాటు మరియు సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో గత నెలలో కల్వకుంట మంజీరా నగర్ కు చెందిన ఇంటి నెంబర్లు,వాటికి కేటాయించడానికి దరఖాస్తు దారులు దాఖలు చేసిన ల్యాండ్ టైటిల్స్ మరియు ప్రాపర్టీ అస్సేస్మెంట్ కాపీలు, ఆస్థి పన్ను రసీదులు ఇంటి ఫొటోలు ఇండ్లు ఉన్న సర్వే నెంబర్ల సమాచారం.కోరగా సరైన సమాచారం ఇవ్వడం లేదని సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయం ప్రజా సమాచార అధికారిపై రాష్ట్ర సమాచార కమిషన్ లో ఫిర్యాదు చేసిన సంగారెడ్డి పట్టణానికి చెందిన ఎం శ్రీధర్ మహేంద్ర.
Comment List