**బోనమెత్తిన సదాశివనగర్, అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవం.*
**బోనమెత్తిన సదాశివనగర్, అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవం.*
♦️ *పట్టువస్త్రాలు,ఒడిబియ్యం, వెండి ఆభరణాలతో మొక్కులు చెల్లించుకున్నారు.*
♦️ **ఆషాఢమాసం పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు.**
క్లీంకార న్యూస్ సంగారెడ్డి:
సంగారెడ్డి మండలం సదాశివనగర్,కులబ్ గూర్ గ్రామంలో ఆషాఢమాసం పురస్కరించుకొని గ్రామ దేవత అయినటువంటి శ్రీ పోచమ్మ తల్లికి ఒడిబియ్యం, పట్టువస్త్రాలు, వెండి ఆభరణాలతో మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గ్రామంలోని ప్రతి ఇంటికి నుండి బోనాలు అమ్మవారికి సమర్పించి,గొర్రె పోతులను, కోళ్లను కోసి మొక్కులు చెల్లించుకున్నారు.పోతురాజులు,శివసత్తుల ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలువగా విన్యాసాలను ఊరు ప్రజలంతా కలిసి వీక్షించి, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా యువకులు ముందు ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ బోనాల పండుగ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,చిన్నలు,మరియు యువకులు పాల్గొని సంతోషంగా పండుగను జరుపుకున్నారు.
Comment List