రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే.
రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూన్, 8
అన్ని వర్గాల అభివృద్ధి కోసం పని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల సహకారం అవసరం ఎమ్మెల్యే జారె
08.06.2025 - ఆదివారం
ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అశ్వారావుపేట మండలం రెడ్డిగూడెం గ్రామంలో ప్రభుత్వ చౌకధరల దుకాణాన్ని సందర్శించారు ప్రభుత్వం రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మూడు నెలల వరకు ప్రజలకు సరిపడేలా సన్నబియ్యాన్ని ముందుగా పంపిణీ చేస్తున్న సందర్భంగా ఈ తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీ సమయంలో నిత్యావసర సరుకులు లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాన్ని సమీక్షించి డీలర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు ప్రజలు ఇబ్బంది పడకుండా నాణ్యత గల బియ్యం సరైన బరువుతో అందజేయాలని ఆదేశించారు
ప్రతి కుటుంబానికి రేషన్ సకాలంలో అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అందరికీ చేరేలా మనమంతా కృషి చేయాలన్నారు అన్ని వర్గాల అభివృద్ధి కోసం పని చేస్తున్న ప్రభుత్వానికి ప్రజల సహకారం అవసరమన్నారు ఎక్కడైనా లోపాలుంటే అధికారులు వెంటనే స్పందించాలని సూచించారు
Comment List