అమృత్ 2.0 ద్వారా నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా అందిస్తామని నారాయణ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు

On
అమృత్ 2.0 ద్వారా నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా అందిస్తామని నారాయణ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు

అమృత్ 2.0 ద్వారా ఇంటింటికి నీరు

అమృత్ 2.0 ద్వారా నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా అందిస్తామని నారాయణ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. గురువారం నారాయణఖేడ్ పురపాలక సంఘం 1వ వార్డు చాంద్ ఖాన్ పల్లి లో అమృత్ 2.0 లో భాగంగా నూతన పైప్ లైన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి రూ. 13.5 కోట్లతో అమృత్ 2.0 పథకానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా  మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో నీటి సరఫరాకు పైప్ లైన్ పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. అమృత్ 3.0 కు కూడా ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో నీటి ఎద్దడి లేకుండా నారాయణఖేడ్ ను తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దారం శంకర్, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ మేనేజర్ వెంకట శివయ్య, మాజీ ఎంపీటీసీ పండరి రెడ్డి, కాంట్రాక్టర్ సాల్మాన్ రాజ్, నాయకులు ముదిరాజ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

92

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బిటి రోడ్ పై ట్రాక్టర్ తో కేజీవీల్స్ నడిపిస్తే సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం :-* సీఐ  కంగ్టి బిటి రోడ్ పై ట్రాక్టర్ తో కేజీవీల్స్ నడిపిస్తే సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం :-* సీఐ  కంగ్టి
బిటి రోడ్ పై ట్రాక్టర్ తో కేజీవీల్స్ నడిపిస్తే సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం :-* సీఐ  కంగ్టి కంగ్టి న్యూస్ క్లింకారా కంగ్టి సర్కిల్...
కంగ్టి తహసీల్దార్ కార్యాలయం లో ఈ రోజు ప్రజవాణి కార్యక్రమం నిర్వహించినరు  కంగ్టి  క్లింకార న్యూస్ కంగ్టి మండల కేంద్రం లో ప్రజవాణి
సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి వివాసంలో రాఖి సందడి...
*రాఖీ పౌర్ణమి సందర్భంగా  రక్షాబంధన్ శుభాకాంక్షలు* 
సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన నాయకులు. KLINKARA న్యూస్- కంగ్టి 
*హత్నూర ఐటిఐ కళాశాల హాస్టల్ సొంత భవనం నిర్మించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల మహేష్ డిమాండ్ చేశారు*..
సమస్య లపై సబ్ కలెక్టర్ ఉమా హారతి ను కలిసిన అలిగే జీవన్. నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రం లో పలు సమస్యలపై ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి ని కలిసిన న్యాయవాది,