ఉత్తమ ఉపాధ్యాయులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఘన సన్మానం. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా అందోల్ నియోజక వర్గం లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు .
ఉత్తమ ఉపాధ్యాయులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఘన సన్మానం.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా అందోల్ నియోజక వర్గం లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు .
ఈ సందర్బంగా నియోజక వర్గం లోని ఉత్తమ ఉపాధ్యాయులను మంత్రి ఘనంగా సన్మానించారు . ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు . ప్రభుత్వం విద్య , వైద్య రంగాల అభివృద్దికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అందోల్ నియోజక వర్గాన్ని విద్య , వైజ్ఞాన కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు . నియోజక వర్గం లో బాలికల విద్యాభివృద్ధి కి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు . ఇప్పటికే మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ లు , నర్సింగ్ కాలేజీ లు , కేజీబీవీ లు , మోడల్ స్కూల్ లు , గురుకులాలలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు , సుమారు 160 ఎకరాల్లో JNTU ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు . మెరుగైన విద్య, ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నామన్నారు మంత్రి దామోదర్ రాజనర్శింహా . ఉత్తమ పౌరులుగా తీర్చిద్దిదే గురుతర బాధ్యత ఉపాధ్యాయుల పై ఉందన్నారు . ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు అందుకున్న అధ్యాపకులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
Comment List