వడ్డీ లేని రుణాలు రెండు కోట్ల 50 లక్షల విలువైన చెక్కులు పంపిణీ క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జూలై 16
వడ్డీ లేని రుణాలు రెండు కోట్ల 50 లక్షల విలువైన చెక్కులు పంపిణీ
క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జూలై 16
దమ్మపేటలో ఇందిరా మహిళా శక్తి సంబురాలు ....
- గ్రామీణ మహిళలలో ఉత్సాహం నింపిన వేడుక
- వడ్డీలేని రుణాలు రెండు కోట్ల 50 లక్షల విలువైన చెక్కుల పంపిణీ
దమ్మపేట : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలం మందలపల్లి గిరిజన బాలుర జూనియర్ కళాశాలలో ఓ అద్భుతమైన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల నుండి వచ్చిన డ్వాక్రా మహిళలు వేలాదిగా పాల్గొన్నారు. డ్వాక్రా మహిళల సాంస్కృతిక ప్రతిభకు ప్రాధాన్యతను ఇస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు, ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు తదితర చక్కని కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ పోటీలలో విజేతలకు నిలిచిన డ్వాక్రా మహిళలకు బహుమతులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధులుగా తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, స్థానిక శాసనసభ్యులు జారె ఆదినారాయణ పాల్గొని డ్వాక్రా మహిళలకు సుమారు రూ 2 కోట్లు 50 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమం గ్రామీణ మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు, వారి సామాజిక, ఆర్థిక స్థితిగతుల బలోపేతానికి దోహదపడనుంది. ఈ కార్యక్రమంలో ఉన్నత స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comment List