సామాజిక ఉద్యమకారులు న్యాయవాద వృత్తిలోకి రావాలి క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జులై 11 

On
సామాజిక ఉద్యమకారులు న్యాయవాద వృత్తిలోకి రావాలి క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జులై 11 

సామాజిక ఉద్యమకారులు న్యాయవాద వృత్తిలోకి రావాలి
క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జులై 11 
న్యాయవాద వృత్తిలోకి వస్తున్న ఉద్యమ శక్తులకు స్వాగతం

హనుమకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పులి సత్యనారాయణ 

      రాజ్యాంగంలో పొందుపరచిన సామాజికన్యాయం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను కాపాడుకోవాలంటే సామాజిక ఉద్యమకారులు న్యాయవాద వృత్తిలోకి రావాలని హనుమకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పులి సత్యనారాయణ అన్నారు. కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన ఐరబోయిన బిక్షపతి, అడ్లూరి పద్మ లకు శుక్రవారం హనుమకొండ కోర్టు బార్ హాలులో నెక్ బ్యాండ్ కట్టి న్యాయవాద వృత్తిలోకి స్వాగతిస్తూ ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం అమలు ద్వారానే సామాజిక న్యాయం జరిగి సమసమాజం ఏర్పడుతుందని, సామాజిక ఉద్యమాల్లో ఉన్నవారు న్యాయవాద వృత్తిలోకి వస్తె సమాజానికి మేలు జరుగుతుందని అన్నారు. న్యాయవాదులకు రాజ్యాంగం పట్ల అవగాహనతో పాటు సామాజిక అవగాహన, సామాజిక చైతన్యంతో ఉండాలని అన్నారు. కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన ఐరబోయిన బిక్షపతి, అడ్లూరి పద్మలు క్రమశిక్షణతో వృత్తిలో రాణించాలని, సమాజంలోనున్న రుగ్మతలను రూపుమాపడంలో, మనుషుల మధ్యనున్న తగాదాలను, కక్షలను ప్రాధమిక స్థాయిలోనే పరిష్కరించి మొదటి న్యాయమూర్తులుగా నిలవాలని సూచించారు.
    ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు సాయిని మాట్లాడుతూ రాజ్యాంగ విలువలు, రాజ్యాంగంలో పొందుపరచిన విషయాలను సామాన్య ప్రజలకు తెలియజెప్పి చైతన్యం చేయడంలో న్యాయవాదులు ముందుండాలని విజ్ఞప్తి చేశారు. సకల అసమానతలు రూపుమాపి సమసమాజ నిర్మాణం కోసం వ్రాసుకున్న భారత రాజ్యాంగం పట్ల మెజార్టీ న్యాయవాదులకు అవగాహన లేదని, న్యాయవాద వృత్తికి సంబంధించిన అవగాహనతో పాటు సమాజానికి రాజ్యాంగానికి ఉన్న సంబంధాన్ని, రాజ్యాంగంలో పొందుపరచిన మానవ హక్కులను న్యాయవాదులు నిశితంగా అధ్యయనం చేయడమే కాకుండా రాజ్యాంగ అమలుకు ప్రజల భాగస్వామ్యంతో రాజ్యంపై ఒత్తిడి తేవాలని అన్నారు. 
   ఈ కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ బార్ అసోసియేషన్ మహిళా సంయుక్త కార్యదర్శులు నాగేంద్ర, శశిరేఖ, న్యాయవాదులు ఆశీర్వాదం, బండి మొగిలి, ఉమ గౌడ్, జన్ను పద్మ, డాక్టర్ జిలకర శ్రీనివాస్, బి ఎస్ పాణి, దండు మోహన్, ఎగ్గడి సుందర్ రామ్, గుడిపాటి లక్ష్మీ, ఆరేపల్లి త్రివేణి, బండ రేష్మ, సుకన్య, మమత తదితరులు పాల్గొన్నారు.

IMG-20250711-WA0092

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

*భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు* *భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు*
*భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు*  నారాయణఖేడ్ నియోజకవర్గం చెందిన బిఆర్ఎస్వి విద్యార్థి విభాగం నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్...
డిఎస్పీగా పదోన్నతి పొందిన దుమ్ముగూడెం ఇన్స్పెక్టర్ బి.అశోక్ , క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూలై
క్లింకార న్యూస్ సదాశివపేట సీఐ వెంకటేశం సంగారెడ్డి జిల్లా సదాశివపేట భారీ వర్షాల పట్ల ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా
క్లింకార న్యూస్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు (బి) గ్రామంలోని నారింజ ప్రాజెక్ట్ ఇటీవల కురుస్తున్న వర్షాలకు
క్లీన్కర న్యూస్ (వాట్పల్లి) మార్వెల్లి . 28/07/2025 నాడు మార్వెల్లి గ్రామమునకు విచ్చేయుచున్న శ్రీ మధు కాశి జ్ఞాన సింహానదీశ్వర శ్రీ శ్రీ శ్రీ 1008 జగత్ గురు డా: చంద్ర శేఖర
క్లింకార న్యూస్ శ్రీ రాచణ్ణ స్వామి వారి దేవస్థానం బడంపేట గ్రామం కోహీర్
క్లింకార న్యూస్ సదాశివపేట: 'ప్రత్యేక అవసరాల పిల్లలకు మెరుగైన బోధన అందించాలి'