బీసీలను మభ్యపెట్టడానికి రిజర్వేషన్ల పేరు తో నాటకం. అందోల్లో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్

On
బీసీలను మభ్యపెట్టడానికి రిజర్వేషన్ల పేరు తో నాటకం. అందోల్లో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్

 

బీసీలను మభ్యపెట్టడానికి రిజర్వేషన్ల పేరు తో నాటకం.
అందోల్లో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్

బిసిలకు 42 శాతం రిజర్వేషన్ అంటూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కపట నాటకానికి తెరతీసిందని అందోల్ మాజీ ఎం ఎల్ ఏ క్రాంతి కిరణ్ ఆరోపించారు. రిజర్వేషన్ లు అమలుచేయడంలో చిత్తశుద్ధి ఉంటే అధికార లోకి వచ్చి ఇరవై నెలలు ఎందుకు ఆగారని ఆయన ప్రశ్నించారు.  ఆర్డినేన్స్ తేవడం అనేది పక్క రాజకీయ ఎత్తుగడ గా క్రాంతి కిరణ్ అభివర్ణించారు. అందోల్ లో ఈరోజు నియోజకవర్గ బి సి నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం లో మాట్లాడారు. నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీ లో తీర్మాణం చేసి కేంద్రానికి పంపించాకా మళ్ళీ ఆర్డినేన్స్ తేవడం న్యాయాపరంగా ఎట్లా సాధ్యం అవుతుందని ఆయన ప్రశ్నించారు.  అసెంబ్లీ తీర్మానము కేంద్రం వద్ద పెండింగ్ లో ఉండగా గవర్నర్ కు  ఆర్సినేన్స్ జారీ చేసే అధికారం ఉండదనే విషయం తెలిసి కూడా బి సి ప్రజలను మభ్య పెట్టడానికి ఆర్డినేన్స్ విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం  తెరపైకి తెచ్చిందని అన్నారు.  ఇదంతా స్థానిక సంస్థల ఎన్నికల స్టెంట్  అని ఆయన అన్నారు. కామరెడ్డి డిక్లరేషన్ లో పేర్కొన్న బడ్జెట్ లో బి సి లకు బడ్జెట్ లో  ఇరవై వేల కోట్లు, కాంటాక్ట్ లలో యాభై శాతం రిజర్వేషన్, పది లక్షల వడ్డీ లేని రుణాలు లాంటి అనేక హామీలను అమలుచేయకుండా తప్పించుకోడానికి ఈ కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి  ప్రజలను మోసంచేసి ఇప్పుడు మళ్ళీ ఎన్నికల పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ డ్రామా ఆడుతుందని ఆయన ఆరోపించారు.

150 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే గత 20 నెలలుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఒత్తిడి చేయడంలేదు, ఎందుకు ఒప్పించలేకపోతున్నారు అని ఆయన ప్రశ్నించారు.

ఆర్టికల్ 200 ప్రకారం బిల్లు కేంద్ర ప్రభుత్వం వద్ద బిల్లు పెండింగ్ లో ఉంటే దానికి సంబంధించిన ఆర్డినెస్స్ తేవడానికి వీలు లేదు అని భారత రాజ్యాంగంలో ఉంటే ఆర్డినేన్స్ ఎలా సాధ్యం అని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఆందోల్ పార్టీ సీనియర్ నాయకులు లింగా గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డిబి నాగభూషణం, పైతరా సాయికుమార్, ఆందోల్ మాజీ ఎంపీపీ రామ గౌడ్ , శశికుమార్, టేక్మల్ మండల అధ్యక్షులు బత్తుల వీరప్ప అల్లాదుర్గం అధ్యక్షులు నర్సంహులు,  రైకోడ్ వట్పల్లి మండల నాయకులు వీరారెడ్డి, వినోద్ గౌడ్, చౌటకూర్ మండల అధ్యక్షుడు శివకుమార్ తో పాటు బి సి నాయకులు  పాల్గొన్నారు

IMG-20250713-WA0123

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

*భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు* *భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు*
*భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు*  నారాయణఖేడ్ నియోజకవర్గం చెందిన బిఆర్ఎస్వి విద్యార్థి విభాగం నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్...
డిఎస్పీగా పదోన్నతి పొందిన దుమ్ముగూడెం ఇన్స్పెక్టర్ బి.అశోక్ , క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూలై
క్లింకార న్యూస్ సదాశివపేట సీఐ వెంకటేశం సంగారెడ్డి జిల్లా సదాశివపేట భారీ వర్షాల పట్ల ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా
క్లింకార న్యూస్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు (బి) గ్రామంలోని నారింజ ప్రాజెక్ట్ ఇటీవల కురుస్తున్న వర్షాలకు
క్లీన్కర న్యూస్ (వాట్పల్లి) మార్వెల్లి . 28/07/2025 నాడు మార్వెల్లి గ్రామమునకు విచ్చేయుచున్న శ్రీ మధు కాశి జ్ఞాన సింహానదీశ్వర శ్రీ శ్రీ శ్రీ 1008 జగత్ గురు డా: చంద్ర శేఖర
క్లింకార న్యూస్ శ్రీ రాచణ్ణ స్వామి వారి దేవస్థానం బడంపేట గ్రామం కోహీర్
క్లింకార న్యూస్ సదాశివపేట: 'ప్రత్యేక అవసరాల పిల్లలకు మెరుగైన బోధన అందించాలి'