ఇల్లందులో జరిగిన ఇందిరా మహిళాశక్తి సంబురాలు బహిరంగసభలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి, సీతక్క లతో కలిసి పాల్గొన్న
ఇల్లందులో జరిగిన ఇందిరా మహిళాశక్తి సంబురాలు బహిరంగసభలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి, సీతక్క లతో కలిసి పాల్గొన్న
-రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జూలై 17
ఇల్లందు పట్టణంలో గురువారం జరిగిన ఇందిరా మహిళాశక్తి సంబురాల్లో భాగంగా జరిగిన బహిరంగసభలో రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి దనసరి అనసూర్య (సీతక్క) లతో పాటు రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రులు లబ్దిదారులకు రేషన్ కార్డులు పంపిణి, ఇళ్ళ పట్టాల పంపిణి వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో కొత్వాల తోపాటు ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, ప్రాజెక్ట్ డైరెక్టర్ రాహుల్, ఎస్పీ రోహిత్ రాజ్, అడిషనల్ కలెక్టర్ విద్య చందాన, జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు వై వెంకటేశ్వర్లు, పలువురు అధికారులు, సొసైటీ చైర్మన్లు పాల్గొన్నారు.
Comment List