*పాఠశాలలను అకస్మీకంగా తనిఖీ చేసిన బాన్సువాడ యం ఎల్ ఎ పోచారం*
*పాఠశాలలను అకస్మీకంగా తనిఖీ చేసిన బాన్సువాడ యం ఎల్ ఎ పోచారం*
క్లింకార న్యూస్ జూలై 14
బాన్సువాడ నియోజకవర్గం
బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని రుద్రూర్ మండలం అంబెం గ్రామంలో తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ను మరియు బాలికల హాస్టల్ ను,వర్ని మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, వర్ని మండలం కోటయ్యక్యంప్ గ్రామంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ బాలికల వసతి గృహం,వర్ని మండలం కోటయ్యక్యంప్ గ్రామంలో గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల,వర్ని మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలను అకస్మీకంగా తనిఖీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి , రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజు
ఈ సందర్భంగా వంట గది, సరుకుల నిల్వ గదులను తనిఖీ చేసి, సరుకులు,కూరగాయల నాణ్యతను స్వయంగా పరిశీలించిన పోచారం గారు.
మేను ప్రకారం రోజు ఆహార పదార్థాలను పెడుతున్నారా అని విద్యార్థినులను అడిగి తెలుసుకుని విద్యార్థుల కోసం వండిన అల్పాహారాన్ని తనే స్వయంగా తిని నాణ్యతను పరిశీలించిన పోచారం .
ఈ కార్యక్రమంలో వర్ని మండల మార్కెట్ కమిటీ అధ్యక్షులు సురేష్ బాబా మరియు వర్ని, రుద్రూర్ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పోచారం గారి వెంట ఉన్నారు
Comment List