కల్లూరు మండల బి ఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీగా మడిపల్లి.,..... క్లింకారా న్యూస్ జూలై 18
కల్లూరు మండల బి ఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీగా మడిపల్లి.,.....
క్లింకారా న్యూస్ జూలై 18
మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య సూచన మేరకు కల్లూరు మండలం బి ఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా జాయింట్ సెక్రెటరీగా కల్లూరు మండలం తెలగవరం మర్లపాడు గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్త, సోషల్ మీడియాలో చురుకుగా పనిచేస్తున్న మడిపల్లి నాగేశ్వరావు ను నియమిస్తున్నట్లుగా, సోషల్ మీడియా కల్లూరు మండలం అధ్యక్షులు సిహెచ్ కిరణ్ కుమార్ తెలిపారు,
నాగేశ్వరావు నియమకం పట్ల కల్లూరు మండలం మాజీ జెడ్పిటిసి కట్ట అజయ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు పాలెపు రామారావు, మండల యువజన శాఖ అధ్యక్షులు పెడకంటి రామకృష్ణ తె లగారం మర్లపాడు సర్పంచులు మోదుగు యశోద వీరయ్య, కస్తాల రాజేంద్రప్రసాద్, సీనియర్ నాయకులు చావా వెంకటేశ్వరరావు, నర్వనేని అంజయ్య, కొరకొప్పు.ప్రసాద్, నందిగామ ప్రసాద్, బొక్క వెంకటేశ్వర్లు, తదితరులు హర్షం వ్యక్తం చేశారు
ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ తనకు పదవి ఇచ్చినందుకు, నియోజకవర్గ ప్రియతమ నాయకులు సండ్ర వెంకట వీరయ్య గారికి, మండల బి ఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ తెలంగాణ ప్రజలను, వంచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను, రేవంత్ రెడ్డి యొక్క నిరంకుశ పాలనపై సోషల్ మీడియా ద్వారా ఎండగడతానని తెలిపారు.....
Comment List