క్లింకార న్యూస్ సంగారెడ్డి:ఈ రోజు, తేదీ 02-08-2025, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన వ్యాయామ ఉపాధ్యాయుల సమావేశం విజయవంతంగా జరిగింది.
ఈ రోజు, తేదీ 02-08-2025, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన వ్యాయామ ఉపాధ్యాయుల సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చ జరగగా, ముఖ్యంగా మండల స్థాయిలో క్రీడా నిర్వహణకు నిధుల అవసరం అనే అంశంపై ఆవేదన వ్యక్తమైంది.
గత క్రీడా సంవత్సరంలో మండల స్థాయి క్రీడా పోటీల నిర్వహణకు రూ. 10,000/- మాత్రమే మంజూరయ్యింది. అయితే, ఈ నిధి క్రీడల నిర్వహణకు మరియు బహుమతుల ను పరిగణనలోకి తీసుకుంటే చాలదనే అంశం స్పష్టమైంది. అందువల్ల, ఈ సమావేశం ద్వారా కొత్త క్రీడాసంవత్సరానికి (2025- 26) రూ. 20,000/- మంజూరు చేయవలసిందిగా కోరుతూ, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం తరఫున జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఎస్. వెంకటేశ్వర్లు గారికి అధికారికంగా వినతి పత్రం అందజేయడం జరిగింది.
ఈ వినతి పత్రం ద్వారా మండల స్థాయిలో మరింత సమర్ధవంతమైన, గౌరవప్రదమైన క్రీడల నిర్వహణకు అవసరమైన సహకారం అందించగలరని ఆశిస్తున్నాము.
కృతజ్ఞతలతో,
M. Subhas Goud
అధ్యక్షులు
N. Ramesh
ప్రధాన కార్యదర్శి
కే. శివకుమారి
మహిళా ప్రధాన కార్యదర్శి
ఎస్. రామకృష్ణ
గౌరవ అధ్యక్షులు
కే. రాజా గౌడ్
కోశాధికారి మరియు
TGPETA జిల్లా కార్యవర్గ సభ్యులు, సంగారెడ్డి జిల్లా.
Comment List