క్లింకార న్యూస్ తిరుపతి, ఆగస్టు 1: జిల్లా వ్యాప్తంగా ప్రింట్ మరియు
క్లింకార న్యూస్
తిరుపతి, ఆగస్టు 1: జిల్లా వ్యాప్తంగా ప్రింట్ మరియు
ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల అభ్యర్థన మేరకు, తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు IPS గారి ఆదేశాలపై, క్యూఆర్ కోడ్ కలిగిన ప్రత్యేక ప్రెస్ స్టిక్కర్లు మీడియా ప్రతినిధులకు అందజేయడం జరిగింది. ఈ స్టిక్కర్లను స్కాన్ చేస్తే, పాత్రికేయుల పేరు, వారు పనిచేస్తున్న మీడియా సంస్థ పేరు, డిజిగ్నేషన్, కలెక్టర్ ఇచ్చిన గుర్తింపు (అక్రిడేషన్) నంబర్ వంటి వివరాలు కనిపిస్తాయని అధికారులు తెలిపారు. ఈ ఏర్పాటుతో నకిలీగా ప్రెస్ అంటూ తిరుగుతున్నవారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అన్నారు. ప్రెస్ స్టిక్కర్లు పోలీసుల అనుమతి లేకుండా ఎవరైనా తయారు చేస్తే, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ, నిజమైన విలేకరుల హక్కులను కాపాడేలా జిల్లా ఎస్పీ చేసిన ఈ చర్య అభినందనీయమన్నారు...
Comment List