త్వరలో జరిగే నూతన వైన్స్ లాటరీ పద్ధతిని అడ్డుకుంటాం సేవాలాల్ యువసేన క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
త్వరలో జరిగే నూతన వైన్స్ లాటరీ పద్ధతిని అడ్డుకుంటాం సేవాలాల్ యువసేన
క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
పాల్వంచ మండలంలోని పట్టణంలో మద్యం సిండికేట్లు ఏర్పాటు చేసి, పాల్వంచ పరిసర గ్రామాలకు పెద్ద ఎత్తున మద్యం సరఫరా చేస్తున్నారని, బెల్ట్ షాపులు నిర్వీర్యంగా నడుస్తుండటం వల్ల ప్రజల ఆరోగ్యానికి భంగం కలుగుతోందని, కుటుంబాల్లో కలహాలు తలెత్తుతున్నాయని సేవాలాల్ యువసేన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంగోత్ సురేష్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.
పాల్వంచ పట్టణంలో ఉన్న బెల్ట్ షాపులను తక్షణమే మూసివేయాలని, మద్యం సిండికేట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే మద్యం కొత్త లాటరీ పాలసీకి సేవాలాల్ యువసేన అడ్డుకుంటుందని తీవ్రంగా హెచ్చరించారు.
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎక్సైజ్ శాఖ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని, బెల్ట్ షాపులకు సంబంధించిన దారుణాలపై చర్యలు తీసుకోవాలని కోరారు, ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన పాల్వంచ మండల అధ్యక్షులు జరపల పరమేష్, గుగులోత్ రాకేష్, అరుణ్ పాల్గొన్నారు.
-ఆంగోత్ సురేష్ నాయక్
జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్,
సేవాలాల్ యువసేన
Comment List